పుట:Neti-Kalapu-Kavitvam.pdf/249

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


214

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

వుండదుగదా అంతా పాత్రసంబాషణమేగదా అయినప్పటికీ ఆసంబాషణళావల్ల అది ఆపాత్ర నిత్యవ్యవహారంలో వాడేభాష అని నిశ్చయించలేకున్నాము. అది కేవలం కవిసమయాన్ని అనుసరించి యేర్పడ్డబాష కనుక పాత్రలసంభాషణం అన్నమాత్రాన అది వారికవిత్వవ్యవహారిభాష అని చెప్పలేము గనుక

"కూకుండనీదు"

"సెందురుణ్ణి"

  ఇవి నాయకుడి నిత్యవ్యవహారభాష అని నిర్ణయింపలేము. ఆమాటలవల్ల అతదు చదువురాని మోటువాడనడం సాధ్యసమమునే హెత్వాభాసం నీడద్రవ్యం చలనమున్నదిగనుక; అవే ఉదాహరణంలో వలె ఋజువుచేయవలైసన ఒక అంశానికి  అట్లానే యింకా ఋజువుచేయవలసిన మరియొక అంశాన్ని హెతువుగా చెప్పడం సాధసమం ఇట్లాటిదాన్నే Fallacy of Undue Assumption  అని పాశ్చాత్యతార్కికులంటారు. ఇక్కడ నాయుడు చదువురానివాడవడం ఋజువు చేయవలెను. "కూకుండనీరు" "సెందురుణ్నీ" అని అతని నిత్యవ్యవహారభాష గనక అనడం హేతువుల్ ఇవి అతడినిత్యవ్యవహారభాష అనడం కూడా ఋజువుకావలసిన అంశమే అదికూడా ఋజువుకాలేదు. కనుక ఇట్లాటిదాన్ని సాద్యసమమనే హేతువుగా హేత్వాభావమని నైయాయుకులు నిరూపించారు. ఈ తీరుగా హెత్వాభాసాన్ని స్వీకరించి నాయకుడు చదువురాని మోటువాడంటే మేమొప్పుకోము అని అంటారా?

సిద్ధాంతం

   చెప్పుతున్నాను: నాటకంలో పాత్రలసంభాషణం పాత్రల నిత్య వ్యవహారసంభాషణంఅ కాదనడం అసంబద్దం పాత్రలకు ఉచితమైన భాష వుండవలెననే వుద్దేశంతోనే రాజు మొదలైనవారికి సంస్కృతం నీచులు మొదలైనవారికి ప్రాకృతభేదాలను తత్తద్దేశాల ననుసరించి చెప్పవలె నని భారతీయసాహిత్యవేత్త లంటున్నారు.