పుట:Neti-Kalapu-Kavitvam.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


213

అనౌచిత్యాధికరణం

సిద్దాంతం

వ్రాస్తున్నాను. ఈఅనౌదిత్యాని కేట్లావున్నా యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాటలు అట్లాటివాటి క్షుద్రత్వానికిగూడా వీటినాయకులు సంస్కారహీనులని చిల్లరమనుషులని విశదపరఛడం అవసరం గనుక యెంకిపాటలు ఉదాహరణంగా ఈవిషయం వివరిస్తాను. శ్రీనాధుడు "కవిసార్వభౌముండ ఘనతగన్నట్టి శ్రీనాధుడువంటివాడ శివభక్తిపరుడ" అని తన భాషను అంతటా ప్రదర్శిస్తాడు. ఈ భాషనే పాత్రలకుగూడా వాడుతాడు అప్పుడని కవిభాషగాని పాత్ర భాషగాని స్పష్టంగా తెలిపిన వాడవుతున్నాడు. అదిగాక కవిభాష

   "ప్ర్భువులలో మాప్రభువులును కవులూ రసికులూ
   అయిన శ్రీ శ్రీ శ్రీ రాజా వెంకటాద్రి అప్పారాచ్వు
   బహద్దూరుగారు యీపాటలు విని ఆనందించేవారు.
   వారి వంశమాచంద్రార్కము నిలుచుగాత మవి పరమేశ్వ
  రుని ప్రార్ధిస్తున్నాను. మా ప్రెసిడేంటుగారు శ్రీయుట
  కోలవెన్ను రామకొటీశ్వరరావుగారి ద్వారా వారి
  దయకు బదులు నావందనము లర్పిస్తున్నాను"

అని యిట్లా కవిభాషా పాత్రభాషా భిన్నంగావున్నవి. ఇంతకూ యెంకిపాటల్లో పాత్రలే మాట్లాడుతారు. కనుక యీ పాటల్లో వున్నది పాత్రభాషే నంటున్నాను.

పూత్వపక్షం


   అవునయ్యా నాటకాల్లో రాజుకు సంస్కృతంవాడుతారు. అయితే ఆరాజు సంస్కృతం మాట్లాడుతాడని అర్దమా? నాటకంలో కవిచెప్పేది