పుట:Neti-Kalapu-Kavitvam.pdf/247

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


212

వ్చాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

ప్రచ్వర్తిస్తుంటారు. కాని పరిణతుల కవి నొక్కకటే అనేకవిధమైన విచారనలను విషయాలై సత్యాలుతిరిగి ఆభిన్నత్వాలాఐక్యం వాయువుయొక్క విభుత్వం ఆశ్లేషాయోగ్యత్వం ఇవన్నీ పరిణతబద్దుల మనోవ్యాపారాల విషయాలు కనుకనే ఇవి ఈయెంకిపాటలనాయకులకు అనుచితమని ఈ అనౌచిత్యం గోరుచుట్తుమీద రోకటిపోటువలె క్షుద్రత్వానికి తోడయిందని చెపుతున్నాను.

పూర్వాపక్షం

అవునయ్యా కావ్యంలో

   "భటవృత్తివాడనై పల్కితి నిట్లు
   కామభూపతిపాద కమలంబులాన
   కరిచేత త్రొక్కింతు గట్టిగా నిన్ను
   భటృటువాడవుగాన బ్రతుక నిచ్చితిని.

   మశకాళితేనెలో మడిసినరీతి
   మిడుతలు చిచ్చులో మిదిసిపడ్డట్లు
   మాచేత చచ్చును మన్నీలుబలము" (పల్నాటివీరచరిత్రం)

అని నాయకుడా అన్నట్లు శ్రీనధుడువ్రాశాడు. అయితే నాయకురాలు ఆభాష మాట్లాడిందని యెవరనగలరు? కవి అట్లా వ్రాస్తాడు కవిశిల్పిఅతనికిష్ణమైన భాషలో వ్రాస్తాడూది ఆపాత్రలభాష అని అనుకోగూడదు కనుక రామకృష్ణాఅనీ "సీకటై లచ్చిమి సెందురుణ్ణీ సూరెయుణ్ణీ"అని యీతీరున కవి వ్రాశాడని అవే నాయకుడిమాట అని అనుకోగూడదు. కనుక ఆమాటలు ఆధారంగా నాయకుడు సంస్కారంలేని మోటువాడని నిశ్చయించలేము అని అంటారా?