పుట:Neti-Kalapu-Kavitvam.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxv


పేరు తెలిసిన ఇంగ్లీషు సాహిత్య పండితులు అందుబాటులో లేకపోవటం వల్ల అట్లాగే ఉంచాను. ఉదాహృత పద్య పాదాలను సాధ్యమైనంతవరకు ఈ కూర్పులో పాద విభజన చేసి చూపించాను. కొన్ని సంస్కృత శబ్దాల వర్ణక్రమాన్ని ఉమాకాంతం గారు నియతంగా పొటించినట్టు కనిపించదు. వాటిని అట్లానే ఉంచాను.

ఈ పీఠికారచనకు ప్రేరేపించిన మిత్రులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారికి సమాచార సామగ్రిని సాదరంగా అందించిన అక్కిరాజు రమాపతిరావుగారికీ, చలసాని (విరసం) ప్రసాదుకూ కృతజ్ఞతలు.

హైదరాబాదు.

1994 జనవరి 26.

చేకూరి రామారావు.