పుట:Neti-Kalapu-Kavitvam.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

191


అంటే అంగంగా స్వీకరించి మధ్యమధ్యసందర్భంవచ్చినచోట ప్రస్తావిస్తూ వచ్చారు. అమాయికులైన సాధారణుల ముగ్ధప్రేమ మనోహరంగానే వుంటుందని, కనుకనే భారతీయులు దీన్ని కావ్యంలో అంగంగా గ్రహిస్తూ వచ్చారని విశదపరచాను. ఈసాధారణులు నీచులని భారతీయులు తిరస్కరింపలేదు.

"పుష్పాసవాఘూర్ణితనేత్రశోభి
 ప్రియాముఖం కింపురుషశ్చుచంబ" (కుమార)

(ప్రియురాలు పాటలుపాడుతూవుంటే పుష్పాసవంతాగడంవల్ల కైపెక్కిననేత్రాలతో వున్న ప్రియురాలి మొగాన్ని ఆపాటలమధ్యన కింపురుషుడు ముద్దుపెట్టుతున్నాడు)

1. కోశాతకీ పుష్పగుళుచ్ఛకాంతిభి
   ర్ముఖైర్వినిద్రోల్బణబాణచక్షుషః
   గ్రామీణ వధ్వస్తమలక్షితాజనై
   శ్చిరం వృతీనా ముపరి వ్యలోకయన్. (మాఘ)
   
2. పశ్యన్ కృతార్థై పరివిల్లవీజనో
    జనాదినాథం న యయౌవితృష్ణతాం
    ఏకాంతమౌగ్ధ్యా నవబుద్దవిభ్రమ
    ప్రసిద్ధ విస్తార గుణై ర్విలోచనైః (మాఘ)
   
3. స వ్రీహిణాం యావదపాసితుం గతాః
   శుకాన్ మృగైస్తావదుపద్రుతశ్రియాం
   కైదారికాణా మభితః సమాకులాః
   సహాసమాలోకయతి స్మ గోపికాః (మాఘ)

1) వికసించి విపులమైన నల్లగోరంటపూవువంటి కండ్లుగల గ్రామీణవధువులు పొట్లపూలకాంతిగల ముఖాలతో జనులకు కానరాకుండా చాటునవుండి ఆవరణాలమీదుగా కృష్ణుణ్ణి చూశారు.