పుట:Neti-Kalapu-Kavitvam.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

189


ఈ కేవల కామప్రవృత్తియొక్క దుష్ఫలాల నిదివరకే విశదీకరించాను కనుక భగవత్త్వారోపవాదం చేత సాధారణుల కామప్రవృత్తి స్వీకార్యమనడం అప్రశస్తం.

ఆక్షేపం

అవును సరే; కొందరన్నవిధాన ప్రియతముడైన నాయకుణ్ని కవి స్వీకరిస్తాడు. కమలం ప్రియతమంగనుక గ్రహిస్తున్నాడు. బొగ్గులు ముండ్లు పెంటప్రియంగావు గనుక స్వీకరించడు. ప్రియతముడు సాధారణుడు కావచ్చును. ధర్మసంబంధి అయిన అసాధారణుడూ కావచ్చును. ఇక్కడ చేయవలసినది ప్రియాప్రియత్వవిచారణగాని ధర్మాధర్మవిచారణగాదు అని ఆంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; ఆమాట అసంబద్ధం కవికి కేవలకాముకుల సాధారణుల ప్రవృత్తియొక్క అనుపాదేయత యిదివరకే నిరూపించాను. గనుక అట్లాటి ప్రవృత్తియందు ఆసక్తివుండడం కవియొక్క పరిపాకాభావాన్ని ప్రాకృతత్వాన్ని తెలుపుతుంది. అసాధారణులు శృంగారంలో కవికి ప్రియతములంటే విప్రతిపత్తేలేదు. నేను ప్రతిపాదిస్తున్న అంశమే అది. పరిణతచిత్తుడైన కవిదృష్టికి ఆనగల అసాధారణుల స్వరూపాన్ని పరామర్శించి వారిట్లాటివారని నేను తెలిపినాను. ధర్మసంబంధంలేని కేవల కాముకులు సాధారణులుపోగా శృంగరంలో మిగిలిన అసాధారణు లేవిధంగానైనా నేను తెలిపిన ధర్మసంబంధంగలవారే అవుతున్నారు ధర్మంయొక్క అనంతముఖత్వ మిదివరకే తెలిపినాను. కనుక యింతకూ చెప్పదలచిం దేమంటే. ఆత్మసంయోగమనడం, అభిమాన మనడం, ఆరోపమనడం, అట్లా ననడం,యిట్లా ననడం యివన్నీ విషయసక్తతకు