పుట:Neti-Kalapu-Kavitvam.pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


188

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

ఆక్షేపం

సౌందర్యాభిమానవాదం పొతే పొనీయండి.మీరు భగవిద్రతి వొప్పుకున్నారుగదా? పురుషుణ్ని భగవంతుణ్ణిగా తలచిస్త్రీ సమీపిస్తున్నది. ఇది జీవాత్మపరమాత్మలసంయోగ మనుకోగూడదా? అప్పుడు సాధారణులశృంగారంగూడా ప్రధానంగా సీకార్యమవుతున్నది అని అంటారా?

సమాధానo

చెప్పుతున్నాన; మీరన్న మాట సరిగాదు. పురుషణ్యే స్త్రీ యెందుకు దైవంగా భావిచవలెను? ఒక రాయిని ఒక చెట్టును. ఒకగోడను కాదా ఒక స్త్రీని యెందుకు దైవంగా భావించరాదు? అది యెందుకు శృంగారం కాగూడదు? యెవరైతే నేమి పురుషుణ్నే భావించిందంటారా? అది వంచన సువర్ణమైతే నేమి సుద్ధమన్నైతేనేమి సువర్ణమే కావలెననేటటువంటి అప్రశస్తపుమాట.ప్రియులైన స్త్రీకి పురుషుడికి ప్రకృతిసిద్ధమైనబంధాన్ని ఆదారం చేసుకొని పురుషుడియందు పరమాత్మ దర్శనాన్ని స్త్రీ సాధిస్తున్నదంటారా? ఇట్లా పరమాత్మ దర్శనమే ప్రాప్యమై విషయసక్తతనుండి ముక్తులైతే ఇదివరకు చూపినట్లు ధర్మా భావవాదికి అంగీకార్యంగాని ఇంద్రియజయం.భగవ్చత్సేవ అనే ధర్మాలు సిద్దిస్తూనే వున్నవి. ఆసందర్భంలో ఆరతి శృంగారసంజ్ఞనువదలి బావసంజ్ఞను పొందుతున్నది. కనుక నాకు విప్రతిపత్తిలేదు.స్త్రీ పురుషుల శృంగారం యిక్కడ నాకు విచార్యవిషయంగాని భగవద్రతిగాదు. ప్రధమఖండంలో భక్తిమతవిచారణలో ఆభక్తిమతమందలి వల్లభసం బంధాన్ని దాని హేయోపాదేయతలను వివరించారు. ఇక్కడ ఆవిచారణ వదులుతున్నాను; భగవద్రతి అనే ఉదాత్తలక్ష్యం యెప్పుడు వనక బడి హద్దుదాటి మనస్సు విషయసక్తమవుతున్నదో అప్పుడే కామ ప్రవృత్తి ఆరబ్దమవుతున్నది.