పుట:Neti-Kalapu-Kavitvam.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

187


సౌందర్యాన్ని అభిమానిస్తూ తృప్తిపడుతూ వుండవ్చచ్చునుగదా పోనీయండి. పాణిగ్రహణం చేసిన నాయికవిషయంలోనైనా కేవల నేత్ర సమారాధనమే లక్ష్యమంటే నాయకుడికి వలెనే నాయికకుగూడా అదే పరమార్థంగా వుండవలె నని యేమి నియమం? ఇద్దరూ ఒకటే చిత్తవృత్తిగలవారై వారికి నేత్రసమారాధనమే లక్ష్యమైతే అసమగ్రమైన దైనప్పటికి కొంతవరకు సంయతమనస్పత్వమనే ధర్మం ధర్మాభావవాదికి అనిష్ఠమైనది సిద్దించనే సిద్ధిస్తున్నది. కనుక అట్లాటిచొట్ల నాకు విప్రతిపత్తి లేదంటున్నాను. కాని సాధారణంగా అన్యోన్యరక్తులైన తరుణస్త్రీ పురుషులవిషయంలో చక్షుఃప్రీతి అంతటితో అంతంగాదు మనస్సు సోపానపరంపరంను ఆరోహించడం సాధారణప్రవృత్తి.

"ఆదర్శనే దర్శనమత్రకామాః
 దృష్ట్వా పరిష్వంగసుఖైకలోలాః
 అలింగితాయాం పునరాయతాక్ష్యా
 ఆశాస్మహే విగ్రహయోరభేదం" (తిశ)

అని హరి జెప్పినమాట లీయాథార్ద్యాన్నే తెలుపుతున్నవి. ఇది సాధారణప్రవృత్తి అన్నాను సంయోగమే ఈప్సితఫలంగా గల వియోగశృంగారం సయితం సంయోగం యొక్క అన్యరూపమే గనుక దాన్ని వేరుగా విచారించవలసిన పనిలేదు. ఈసంయోగం పధానం గానీయండి అప్రదానం గానీయండి కామనంబంధే అవుతున్నది. కేవలకామంయొక్క దుఃస్వరూపాన్ని యిదివరకే విశదంచేశాను. కనుక సౌందర్యవాదంచేత సాధారణులశృంగార ప్రధానంగా స్వీకార్య మనడం అనుచితం