పుట:Neti-Kalapu-Kavitvam.pdf/221

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


186

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

యోగమే ప్రధానమైతే ఒకస్త్రీ ఒక పురుషుడూ యెందుకు?ఆడ ఆత్మ మగ ఆత్మ వేరుగాలేవుగదా .ఇద్దరూ స్త్రీలే? యెందు కొకరినొకరు ప్రేమిందుకొనగూడదు?ఇద్దరికీ ఆత్మ లున్నవి. ఆఆత్మలసంయోగ మెందుకు శృంగారంకాగూడదు? ఇద్దరూ పురుషులే యెందు కొకరినొకరు ప్రేమించుకొనగూడౌ? ఇద్దరికీ ఆత్మలున్నవి. ఆఆత్మలుసంయోగ మెందుకు శృంగారం కాగూడరు? ఇవన్నీ అయోమయపు అసంబద్ద వచనాలు. అందుకే భారతీ సాహిత్యవేత్తలు ఆత్మలుఆత్మలసంయోగం ప్రియమైన స్త్రీపురుషుల విషయంలో గాక జీవాత్మ పరమాత్మలవిషయంలో ప్రతిపాదించారు. అది భగవద్రతి స్త్రీపురుషుల రతినుండి వేరుగా నిర్వచించడానికి దాన్ని భావంలో చేర్చారు. "రతిర్దేనాది విషయా భావ; ప్రోక్త: కాంతాది విషయతువ్యక్త: శృంగార:? అని కావ్య ప్రకాశకారు డీ అంశం తెలుపుతున్నాడు. కనుక ఆత్మసమ్యొగమని సాధరణులశృంగ్గారం స్వీకార్యమనడం అనుచితం.

ఆక్షేపం

అవునయ్యా శృంగారం ఆత్మలసంయోగానికి సంబంధించింది కాకుంటే కాకపోనియ్యండి పురుషుడు స్త్రీనిగాని స్త్రీ పురుషుణ్నిగాని ప్రేమించడం సౌందర్యాభిమానంచేత. అదే దాంట్లో ప్రధానం. సౌందర్యానికి ధర్మాధర్మవిచారన అనావశ్యకం అందువల్ల సాధారణుల శృంగారం కూడా ప్రధానంగా అంగీకారమేనంటారా?

సమాధానం

వివరిస్తాను. సౌందర్యాభిమానానికి శృంగారం సంబంధిఛినదైతే సుందరులైన తల్లి కూతురు, చెల్లెలు పినతల్లి పినతల్లి కూతురు ఇట్లా టివాండ్ల నెందుకు ఆ అభిమానానికి విషయం చేసుకోగూడదు? వారి