పుట:Neti-Kalapu-Kavitvam.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

185

(కామాత్మతప్రశస్తంకాదు. అయితే కామాత్మత లేకుండా వుండడం లేదు) అని మను వన్నట్లు ధర్మ కామాలచేరికే గృహస్థాశ్రమానికి పూజ్యత్వాన్ని ఆపాదిస్తున్నది.

"ధర్మేణాపి పదం శర్వే కారితే పార్వతి ప్రతి

 పూర్వాపరాధభీతస్య కామస్యోచ్చ్వసితం మనః

(కుమా 6)

అని కామం ధర్మంచేత పవిత్రితమైన తరువాత పరమేశ్వర గార్హస్థ్యాన్ని ప్రతిపాదించిన కాళిదాసీసత్యాన్నే వినిపిస్తున్నాడు.

ఇంతేగాని కేవలకామంవల్ల ఒకపురుషుడు ఒకస్త్రీ కలిసివుండడమే విశేషంగాదు. కనుక ఉత్తమోత్తమమైన ఆశ్రమధర్మాల ఆనులేని కేవలకాముకులు కలయిక అచంచలంగానీ, చంచలంగానీ, గాఢంగానీ, అగాఢంగానీ, మాయికంగానీ, ఆమాయికంగానీ అది ప్రధానంగా స్వీకార్యంగాదు.

ఆక్షేపం

సరేగాని యిది మేమంగీకరించము మీరెన్ని చెప్పినా శృంగారానికి ధర్మసంబంధం మేమొప్పుకోము. యెందుకంటారా? కొందరన్నట్లు శృంగారంలో జరిగేది ఆత్మలసంయోగం. అదే అక్కడ ప్రధానంగాని దైహికసంయోగం గాదు. ఆత్మ సర్వపరిశుద్ధం. దానికి ప్రధానంగా స్వీకార్య మేనంటే

సమాధానం

చెప్పుతున్నాను ఆమాట సరిగాదు శృంగారంలో ఆత్మలసం