182
వాజ్మయ పరిశిష్ఠభాష్యం - నేటికాలపుకవిత్వం
క్షుద్రఫలకమైన శృంగారం గనుక క్షుద్రమని. సంస్కారవంతులకు ప్రధానంగా ఉపాదెయంకాదని చెప్పుతున్నాను; శృంగారానికి ధర్మసంబంధంలేనప్పుడు తేజోహినమవుతున్న దని అది యెంకయ్య చంద్రమ్మ పాట, యెంకిపాటలవంటి వాటిలో పశుకృత్యంగా వుంటున్నదని విశదపరిచాను.
అయితే ఇట్లాటి సాధారనకృత్యాలు, సాదారణశృంగారం లోకంలో వుంటున్నవే. వాటిసంగతి యేమంటే అవ్చి ప్రశంసించతగ్గవి కావంటున్నాను. ముద్దు పెట్టుకొని పురుషుడూ. స్త్రీకలిసి పరుండడం విడిపోయి వొకరినొకరు వెతుక్కొనడం. యివే శృంగారస్వీకరణానికి ప్రధానంగాదు. అవి ధర్మ బద్ధుల్లో నిష్టమై, అవి అధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడు శృంగారం స్వీకార్య మవుతున్నది. ఆకలికావడం అన్నంతినడం విశేషంకాదు. ఆ అన్నంతినేవాడు ధర్మపరతంత్రుడై ఆ ఆన్నంమూలాన బలంకలిగి అది లోకాభ్యుదయానికి హేతువైనప్పుడు ప్రశస్యమవుతున్నది అందుకే ధర్మపరతంత్రుడియొక్క త్యాగియొక్క ఐశ్వర్యం ప్రశస్యమవుతున్నది.
"త్యాగాయ సంభృతార్ధానాం"
అని యీసత్యాన్నే కాళిదాసు వినిపిస్తున్నాడు.
ముద్దుపెట్టుకుని స్త్రీ పురుషులు కలిసి పరుండడం, విడిపొయి ఒకరినొకరు వెతుక్కొనడం యివే శృంగారస్వీకరణానికి ప్రధానం గావన్నాను ఇవి వుపేక్షించ దగ్గ సాధారనకృత్యా లంటున్నాను. ఈకృత్యాలు అధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడే అవి మనకు స్వీకార్యావుతున్నవి. శృంగారం పరిణతనాయకనిష్ఠయైనప్పుడే యిట్లాటిదశ సిద్ధిస్తున్న దని సాధారణుల్లో అది ముడిశృంగారం గానే వుంటున్నదని విశదంచేశాను. కనుక చిత్తసంస్కారంలేని సాధరణుల శృంగారం క్షుద్రమని మనకు ప్రధానంగా స్వీకార్యం గాదని అంటున్నాను.