పుట:Neti-Kalapu-Kavitvam.pdf/204

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


169

శృంగారాధికరణం

ప్రాచీనభారతవర్షంలో రాజత్వం ధర్మరక్షకత్వం సమానాధికరనాలుగా వుండేవి. అధర్మి అయినరాజున్ నేనుణ్నిఫ్వలె పదచ్యుతుణ్ణి చేసేవారు. నాయకుడికి స్పుటధర్మరక్షకత్వం ప్రతిపాదితంగాక శాకుంతలాదుల కన్న తక్కువ కక్ష్యలో చేరుతున్న మేఘదూతలో సయితం

    "యక్షశ్చక్రే జనకతనయాస్నానపుణ్యోదకేషు
    స్నిగ్దచ్చాయాతరుషు వసతింరామ గిర్యాశ్రమేమ." (మేఘ)

అని జానకి స్నానపానమైన పురకాలుగలచొట వసతిచేసుకున్మాడని అతడి జానకిపాతివ్రత్యంమీదిఆసక్తి రూపమైనధర్మాన్ని విశదపరుస్తాడు.

     "యాచ్చామోఘా నరమధిగుణే నాధమే లబ్దకామా"

అనిఅనిపించి ఉత్తములైన గుణవంతులమీది ప్రేమరూపమైన ధర్మాన్ని స్పష్టపరుస్తున్నాడు. శృంగారానికి ధర్మసంబంధి నాయకుది అవశ్యకత యింతటిది గనుకనే సాహిత్యవేత్తలు

    "అనురక్తలోక: తేజోచైదగ్ద్య
        శీలవాన్ నేతా త్యాగీ కృతీ" (సాహి)
     "ఉత్తమప్రకృతిపాయ:
         రస: శృంగార ఇష్యతే" (సాహి)
     "లోకోత్తర నాయకాశ్రయేణ
         శృంగారస్య పరిపోషాతిశయ:" (సాహి)

అని నిరూపిస్తున్నారు శ్రీరాముడు. నలుదు, ఉదయనుడు యిట్టి ధర్మ పరతంత్రులు శృంగారనాయకులై భారతీయకావ్యంలో శృంగార తత్వాన్ని ప్రబోధిస్తునారు.