పుట:Neti-Kalapu-Kavitvam.pdf/203

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


168

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

విదితభక్తిని నన్ను మహర్షికి ఆమె తెలుపుతుందిగదా0

    "తపోవన నివాసినాం ఉపరోధో మాభూత్"
  (తపోవననివాసులకు ఉపరోధం కలుగకుండును గాక) అని యీతీరున వ్యక్తపరుస్తాడు. ఉత్తరరామచరిత్రలో భవభూతి విప్రలంభశృంగార నాయకుడైన శ్రీరాముడి ధర్మతత్పరత్వాన్ని

    "స్నేహం దయాంచ ప్రీతించ యదివా జానకిమపి
     అరాధనాయ లోకానాం ముంచతొ నాస్తి మేవ్యధా" (ఉత్తర)

  (ప్రజలను అరాధించడానికి స్నేహాన్నివిడిచినా దయనువిడిచినా ప్రీతిని విడిచినా, చివరకు జానకిని విడిచినాగూడా నాకు చింతలేదు) అని వినిపిస్తాడు. కాదంబరిలో బాణుడు శృంగారసందర్బంలో అంగకధలో వచ్చే పుండరీకుడివిషయాన సయితం పవిత్రగుణధర్మాలను ప్రస్తావిస్తాడు.
  మహోశ్వేతమీదివాంచచేత పుండరీకుడు మృతుడుకాగా
  "హాధర్మ! నిష్పరిగ్రహోసి, హాతపొనిరాశ్రయమసి, హాసర స్వతి.

విధవాసి, హాసత్వం అనాధమసి" (కాదం)

  (హోదర్హమా! నివృరిగ్రహమైనావు. హాతసస్సా! నిరాశ్రయమైనావు. హాసరస్వతి! నీనాధుడు పోయినాడు హాసత్యమా! అనాధ మయితివి"

అనే కపింజలవిలాసంలో పుండరీకుడి సత్యధర్మ పరత్వాది గుణాలను విశదీకరిస్తాడు.

   ధర్మం అనంతరూపమైనది తపస్సు, దయ, సత్యం, అహింస పరదారైముఖత్వం, పరధనపరాణ్ముఖత్వం సత్కార్యదీక్ష మొదలయిన అనంతరూపాలతో ధ్రర్మదేవత వెలసివున్నది. మాధవుడు చారుదత్తుడు అగ్నిమిత్రుడు చంద్రాపీడుడు అందరు ధర్మసంబందంగల వారే అయివున్నారు. మృచ్చకటికలోని చారుదత్తుడి ధర్మపరతంత్రత్వం మొదలైనవి వివరించడం గ్రంధవిస్తరహేతువని వదలుతున్నాను.