పుట:Neti-Kalapu-Kavitvam.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

167

కేవలం కామిని అగ్నివర్ణుణ్ని అంతఃపురంలోవుండి ప్రజలకు దర్శనం సయితం ఇయ్యక కాలుమాత్రం చూపి స్త్రీలోలుడై వున్నవాణ్ని చిత్రించి అతడు చివరకు క్షయపుట్టి చచ్చినాడని ముగించాడు. పడకటింటిలో ఆకస్మికంగా స్త్రీ కనబడగా నీకొంగురాచుకున్నది. నాకు నిద్రపట్టదని అనిపించక ధర్మదేవతను ఆరాధిస్తూ

"కా త్వం శుభే కన్య పరిగ్రహో వా
 కిం వా మదభ్యాగమకారణం తే.
 ఆచక్ష్వ మత్వా వశినాం రఘుణాం
 మనఃపరస్త్రీవిముఖప్రవృత్తి". (రఘు.)

(ఓకల్యాణీ నీవెవరు? నీ వెవరిభార్యవు? రఘువంశరాజులు పరస్త్రీవిముఖులైన విజితవిషయులని తెలిసిగూడా నీవెందుకు వచ్చావు?) అని కుశుడిచేత కాళిదా సనిపిస్తాడు.

కామాన్ని దహించిన పిమ్మట బ్రహ్మతేజస్సుతో వెలిగే పరమేశ్వరుడిచేత, సంయోగం కొరకు కామాన్ని అతిక్రమించి తపస్సు చేస్తున్న పార్వతిని, పవిత్రురాలిని కాళిదాసు చేయిస్తాడు. శాకుంతలంలో శృంగారనాయకుడైన దుష్యంతుడి ధర్మారాదనను.

"ధర్మ్యాః తపోధనానాం
 ప్రతిహతవిఘ్నాః క్రియాః సమాలోక్య
 జ్ఞాస్యసి కియద్భుజో మేరక్షతి మౌర్వీ కిణాంక ఇతి." |(శాకుం.)

(తపోధనులయొక్క ధర్మవిహితమైన క్రియలు ప్రతిహతవిఘ్నాలైవుండడం చూసి "నామౌర్వీకిణాంకమైన భుజ మెంతదూరం రక్షిస్తున్న దనే సంగతి తెలుసుకోగలవు.)

"సాఖలు విదిత భక్తిం మాం
 మహర్షేః కథయిష్యతి". (శాకుం.)