పుట:Neti-Kalapu-Kavitvam.pdf/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


166

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

అణగినప్పుడే ధర్మం స్థిరచికాసంతో ప్రకాశిస్తున్నది. ధర్మంతో సమస్త కల్యాణగుణాలూ వికాసం పొందుతున్నవి.

ముందు శృంగారాధివతగా వెలయబోతూ అరణ్యస్థలిలో ప్రియసంయోగం కొరకు తపస్సాచరించే పార్వతియందు ప్రియుడైన పరమేశ్వరుడికి కామాన్ని తొక్కినిల్చున్న ధర్మమే గోచరించి.

"అనేన ధర్మ: సవిశేషమధ్య మే త్రివ్యర్దసార: ప్రతిభాతి భావిని, త్వయా మనో నిర్విషయార్ధకామయా యదేక ఏవ ప్రతిగృహ్య సేవ్యతే"

(ఓ పార్వతీ! ఇందువల్ల ధర్మమే త్రివర్గసారమైనట్టు నాకు తోస్తున్నది. యెందువల్లనంటే; అర్ధకామాలు తలపెట్టకుండానే ధర్మాన్ని ఒక్కదాన్నే ప్రతిగ్రహించి నీవు ఆరాధిస్తున్నావు) అని అంటాడు.

ఓ పార్వతీ! ధర్మార్ధకామాల్లొ ధర్మసారత్వం నేడు నాకు కనబడుతున్నదీ. అర్ధకామాలను అధ:కరించిన నీవు దాన్ని (ధర్మాన్ని) ఒక్కదాన్నే అరాధిస్తున్నావు అని అభిప్రాయం తెలుపుతాడు. పశుత్వద్యోతకమైన కామం అడుగుకుపోయిన తరవాత ధర్మం ఆలంబనం అయిన సమయాన పార్వతీపరమేశ్వరుల సంయోగాన్ని కుమారసంభవంలొ ఆరాధించిన కాళిదాసు

"అస్యర్ధకామో తస్యాస్తాం ధర్మ ఏవ మనీషిణ:" (రఘు)

ఆ దిలీపమహారాజును అర్ధకామాలుగూడా ధర్మమే అయినవి.

అని వేరొక చోట అంటాడు ఇట్లా అర్ధకామాలను సేవకులుగా జేసుకున్న ధర్మసారత్వాన్ని కాళిదాసు అనేకస్థలాలల్లో తన కవితాసర్గంలో ప్రకటిస్తాడు.