పుట:Neti-Kalapu-Kavitvam.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


161

శృంగారాధికరణం

ఈతీరుగా శృంగారంయొక్కగ్రాహ్యత్వం వాని మాధుర్యాన్ని బట్టేగాని ధర్మానుబందిత్వాన్ని బట్టికాదు అని అంటారా?

సిద్ధాన్తం.

చెప్పుతున్నాను, శృంగారం మాధుర్య హేతువుచేతనే గ్రాహ్యమైతే ఒకజారుడు పరకాంతతొ కూడినప్పటి శృంగారం మనకుఇ గ్రాహ్యంగా వుండవలెను. సీతాద్రౌపదీ విషయకమైన రావనకీచకుల రతి మనకు మనోహరంగా వుండవలెను చోరులు దగాకోరులు హంతకులు వీండ్ల శృంగారం మనకు గ్రాహ్యంగా వుండవలెను. కాని యీ శృంగారం హెయమనేసంగతి సహృదయుల కందరికి విదితం. అవునయ్యా పరకాంతతో జారుడుకూడినప్పటిశృంగారంకూడా గ్రాహ్యమెందుకు కాదు? గ్రాహ్యమేను అని అంటారా? చెప్పుతున్నాను. అది లోకస్థితికి సంఘ క్షేమానికి హానికరం గనుక దాన్ని మనం ద్వేషిస్తున్నాము ఇది సాధారనవిషయం గనుక దీన్ని విస్తరించి మీమాంస చేయవలసిన పనిలేదు. దుష్టులశృంగారం సంస్కారవ్ంతులకు గ్రాహ్య్హంగ వుండదు. జారులకు జారశృంగారం రుచించవచ్చును. కాని దుష్టుల ప్రీతితో మనకు పనిలేదు. కావ్యంలో సహృదయానందమే ప్రమాణం సహృదయులకు దుష్టుల శృంగారం అగ్యాహ్యమని నిరూపించాను కనుక శృంగారం మాధుత్య్హ హేతువుచేతనె గ్రాహ్యంగాదంటున్నాను.

పూర్వపక్షం.

మీదు నాయకులను ప్రధానంగా విచారిస్తున్నారు. అక్కడ నాయకుడు దుష్టుడైనా శిష్టుడైనా దానితో మనకు పనిలేదు. రసాస్వాదసమయంలో వీడు రాముడు. వీడు వావణుడు. ఈమె తార, ఈమె సీత, ఈమె స్వాయ ఈమ పరకీయ, అనే పరిచ్చేదమే వుండదు. స్త్రీపురుషసాధారణ్య ప్రతీతి తప్ప మరేమీవుండనేరదు.