పుట:Neti-Kalapu-Kavitvam.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xx


లేక పోయినా ఉమాకాంతంగారి వాఙ్మయ దృష్టిని అర్ధం చేసుకోటానికి ఈ వాఙ్మయ దర్శన సూత్రాలు ఉపయోగపడతాయి. ద్వితీయాలోకంలో.

1. అభారతీయము గనుక 2. సంప్రదాయ విచ్చేదము గనుక 3. త్యాజ్యము క్రీస్తు శకము 4. ఆత్మీయము గనుక 5. అఖండ కాలదర్శన సాదనము గనుక 6. శ్రుతి స్మృతి పురాణేతిహాస దేశీయ కధాచులనుండి అవిచ్ఛిన్నత్వము ప్రతిపాదించును గనుక 7. సంప్రదాయ సిద్ధము గనుక 8. గ్రాహ్యము కలిశకము 9. అవిశేషము వల్ల కలిశకము కృష్ణ శకమని 10.అంతర్భూతము గనుక శాలివాహనము పాక్షికముపధ--

ఉమాకాంతంగారు క్రీస్తు శకాన్ని కూడా గుర్తించని సంప్రదాయ ప్రియుడు. ఆయన తన పీఠికల కిందా, ముద్రించిన రచనల పైనా శాలివాహన శకాన్నే వేసేవారు.

ఉమాకాంతంగారు వాఙ్మయ దర్శనంలో భారతీయ సంస్కారాదుల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఇది కాక వేరే ఇంకా ప్రాచీనాంధ్ర వాఙ్మయ సూత్రాల గురించి ఏమైనా రాశారేమో తెలీదు. 'నేటి కాలపు కవిత్వం' అని నామాంతరం ఉన్న ఈ వాఙ్మయ సూత్ర పరిశిష్ట భాష్యంలో మూడు అధ్యాయాలలో ఆధునికాంధ్ర వాఙ్మయాన్ని సూత్రీకరించారు. అందులో మొదటి అధ్యాయం నేటి కాలపు కవిత్వం. దాన్ని మాత్రమే విపులీకరించారు. నేటికాలపు కృతి రచన నేటికాలపు విద్య అనే అధ్యాయాలు సూత్ర రూపంలోనే ఉన్నాయి. భాష్యం రాయలేదు. ఈ పరిశిష్టాన్ని ఆలోకనాలు అనకుండా అధ్యాయాలుగా విభజించటం వల్ల వాఙ్మయ దర్శనం కన్నా బిన్నమైన వాఙ్మయ సూత్రాలు అనే గ్రంథాన్ని రాసినట్టుగానో, కనీసం రాయ తలపెట్టినట్టు గానో ఊహించాలి. అయితే మనకు పూర్తిగా భాష్య రూపంలో దొరుకుతున్నది. ఈ పరిశిష్ట సూత్ర భాష్య రూపమే (అదీ మొదటి అధ్యాయమే) మొదటి సారి వావిళ్ళ ప్రచురణగా 1928 లో వెలువడింది.

ఉమాకాంతం గారు ఈ పుస్తకంలో ప్రధానంగా భావకవిత్వం పేరుతో ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు.