పుట:Neti-Kalapu-Kavitvam.pdf/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది                శృంగారాధికరణం           153
      చేత   పశువులచేత   బ్రహ్మతేజస్సు   చేత   గొప్పవాడ
      వుతున్నాడు.  కీర్తి చే తను  గొప్పవాడవుతున్నాడు. 
     ౮. అన్నాన్ని   పరిహరించగూడదు.  అది  బ్రహ్మవేత్త కు వ్రతం.
      వుదకాలే  అన్నం. జ్యోతిస్సు అన్నాన్ని భక్షించేది.
     ౯. అన్నాన్ని   గౌరవించవలెను.  అది  బ్రహ్మవేత్తకు  ప్రతం.
      భూమే అన్న స్వరూపం. ఆకాశం  అన్నాన్ని  భక్షించేది. 
     ౧౦.యేప్రకారం చేతనైనా విస్తారమయిన అన్నాన్ని పొంద
      వలసినదీ.. 
     ౧౧.నేను  అన్నాన్ని.  నేను  అన్నాన్ని. నేను అన్నాన్ని. నేను
      అన్నాన్ని  భక్షించేవాణ్ని.  నేనుఅన్నాన్ని  భక్షించే  వాణ్ణి.
      నేను అన్నాన్ని భక్షించే వాణ్ని. 
   అనితీరున  ఉపనిషత్తులు  అన్న  మాహాత్మ్యాన్ని  ప్రశంసిస్తున్నవి. 
   ఛాందోగ్యంలో  ఉషస్తే  ప్రతిహర్త  నడిగితే అన్న మే దేవత అంటాడు. 
   వేదపురుషుడు   తెల్లకుక్కరూపంతో   అన్నమాహాత్మ్యం   బకుడికి 
   ఉపదేశిస్తాడు. ఇంకా ఉపనిషత్తుల్లో అన్న ప్రశంసవున్నది. ఇట్లా ప్రశస్తమైన 
   భోజనాన్ని  కావ్యంలో  యేందుకు  వర్ణించరాదు?  కానీ   భోజనాన్ని 
   ప్రధానవస్తువుగా   తీసుకొని  కావ్యాలను  రచించడంలేదు అట్లా రచిస్తే 
   జుగుప్సగా  వుంటుంది. అట్లానే  శృంగారాన్ని  కూడా  ప్రధానాంశంగా 
   తీసుకొని  కావ్యం  రచించడం  అప్రశస్తం.
     "ఆహార  నిద్రాభయమైధునాని." 
   అని  అన్నట్లు భోజనం మైధునేచ్ఛాయివన్నీ పశుకృత్యాలు. ఈపశుగుణం 
   యొక్క  తృప్తి  కోసం యెవరికి  లభించీనరీతి వాండ్లు పాటుపడతారు. 
   ఇది చెప్పుకోతగ్గ  విషయంగాదు. అందుకే
     "లాటీనేత్రపుటీపయోధరఘటీ  రేవాతటీ  నిష్కుటీ, 
     పాటీరద్రుమవర్ణనేన  కవిభిర్మూర్దినం  నీయతే."