పుట:Neti-Kalapu-Kavitvam.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది 150    వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపు కవిత్వం
       (ప్రణయగీతాలు, భండారు రాజేశ్వరావు.  భారతి. 2-2.) 
    "నాకు రెక్కలుంటే నీవద్దవ్రాలి నిన్ను ముద్దు పెట్టుకుంటాను."
                (నాదెండ్ల వెంకట్రావు, భారతీ. -2-2.) 
    "ఓతరుణీ నీకౌగిట్లో  జేరి  తనువుమరుస్తాను. నామీద  ఆకాశం 
    పడ్డా భయంలేదు. (ప్రణయోన్మాదం. పాణిని. భారతి. 1.3.)
    "నాప్రణయగాన శబ్దాలకు విశ్వమంతా  చలించి నిట్టూర్పు 
 విడిచిందీ." (వేదుల సత్యనారాయణ శాస్త్రి, భారతీ. 1-3.)
    "గువ్వజంట  చింతచెట్టుమీద  సరసమాడుతున్నవి. 
 చప్పుడైనపుడెల్లా నీవే వస్తున్నావని చూస్తు న్నాను." 
                     (సౌదామిని, భారతీ. 1-10.) 
    "కలికి ఒండోండుకోరనీ వలపుదక్క." 
    (పువ్వాడ  శేషగిర్రావు,  చోడవరపు  జానకిరామయ్య, భారతి.)
    "దానిచీరె  కొంగు  రాచుకున్నది. నిద్రపట్టదు. దానిచూపులు 
 దానికులుకులు  ఎదురుకొంటున్నవి."
           (కవికొండల వెంకటరావు, భారతి. 2-10.) 
    "నన్ను విబుధులు విడిచినా, నామిత్రులు విడిచినా నాప్రేమభాగ్యం 
    వుంట నా  కేమిభయం."
                (గరిగిపాటి రామమూర్తి, భారతి. 2-11.)    
    "ముద్దులొలుకు  నీరూపుపిల్లా,  మూర్ఛదెచ్చెనేమో  పిల్లా."
                          (భారతి. 1-12) 
    "నిన్ను  వలచుట  జానకీ  నేను  నేను." (భారతి, 1-11.) 
 అని   అంటున్నారు.  పైవాటిలో   అక్కడక్కడ  మూలపద్యాలను 
 నేను  గద్యంలో  ఉదాహరించను. యెంకిపాటలు, శృంగారమనే గ్రంథం 
 భారతిలో ప్రణయగీత,  ప్ర  ణయసౌధ,  ప్రణయోన్మాద  ప్రభృతులు 
 వెలువరించిన శృంగారం యిది. మంచిదీ దీనితత్వమేమిటి? ఇది హేయమా? 
 ఉపాధ్యమా? అని యిక విచారిస్తాను.