పుట:Neti-Kalapu-Kavitvam.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


149

శృంగారాధికరణం

  "నాచన్నులు నావెండ్రుకలు నాముఖం నాపెదవి నీవే నని
  బాసజేసి ఆమాటతీర్చకఫోవడం మంచిదేనా" అని

   "సావిట్లోగాజులుచప్పుడయినట్లు సిటి కేసినరమ్మని చెయ్యూపి
    నట్లు

అని యిట్లాటివి కనబడుతున్నవి. ఇక భారతిలో ప్రణయగీతాలు ప్రణయసౌధాలు ప్రణయజానకి మూగనోములు మొదలైనవాటిలో

    "అది నడిచేటపుడు జీరాడుతుచెళ్లురేపే దుమ్ములో ఒకరేణువు
     నయితాను." (నాయని సుబ్బారావు బారతి 1-7-61)
     "ఏమి చేయుచు నుండునో యింటిలోన నాదుజానకి నా
     రతనాల బొమ్మ" (అధికార్ల సూర్యనారాయణ భారతి 1-2)
     "ఎప్పుడు ప్రియుడువస్తాడా ఎప్పుడాముద్ధుమొగంచూస్తానా
     అని ఆతురపడుతున్నాను" (సౌదామిని భారతి 1-1)
     "ఓకాంతా నన్నొక్కసారి చూడు నెకటాక్షామృతంలో రాలే
     చినుకులను తాగనియ్యి. నీచూపుభిక్షపెట్టు"

     (ప్రణయసౌధం మామునూరు నాగభూషణరావు భారతి 3-3)

ఓప్రియురాలా!

   "నీవు నన్నుచూడవచ్చేటపుడు ప్రణయరసంతో నీపాదాలు
   కడుగుతాను. నామమన: పుష్పహారం నీమెడలో వేస్తాను. నా
   హృదయదీపకళికతో హారితిస్తాను. ప్రణయగీతాలు పాడుతాను
    నీపాదాలదగ్గరవాలే పూజాపుష్పాన్నౌతాను. నాకు స్వర్గంవద్దు
   నీనీడలోవుంటే చాలు నాకు గంగాజలం వద్దు నీ
   మధురామృతంలో అమృతపు చినుకునైతా నాకింద్రపదవి
  వద్దు నీకంటిలొ పాపనైతా"