పుట:Neti-Kalapu-Kavitvam.pdf/183

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



148         వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం
  నా కనేకవిధముల సహాయసంపత్తి  నొసగుచున్న ప్రాణమిత్రులగు 
  బసవరాజు  వెంకటప్పారావు,  దువ్వూరిసాంబమూర్తి,  యేడిద 
  సూర్యనారాయణగార్లకు  శతహస్రవందన  కునుమార్పణములకన్న
  నేనేమీ యువకరింపగలను." 
 అనిప్రకటించారు. ఈ తీరుగా వీరందరు ఈశృంగారాన్ని యెంకిపాటలను 
 మెచ్చుకోవడమేగాకుండా  భారతి  ప త్రికనిండా  ప్రణయజానకి  అని 
 ప్రణయినీగీతాలనీ   ప్రణయగీతాలని   ప్రణయసౌధమనీ   వీరీవిగా 
 కనబడుతున్న వి. వీరిట్లా ప్రీతీ జూపిన వీటితత్వమేమిటీ అని వీటినన్నిటిని 
 శ్రద్దతో పరిశీలించాను. ఇక వీటివిచారణ ఆరంభిస్తాను.
               యెంకిపాటలకథ.

   యెంకినినాయుడు  వరిస్తాడు.  ఆమె  మొట్టమొదట బెట్టుచూపీ 
 తరవాత అతడికి వశమవుతుంది. రాత్రుల్లో చేలో నాయుడుంట యెవరికీ 
 తెలియకుండా  అతడికొరకు నీటుగా  వస్తుంది.  మంచెకింద గోనెపట్ట 
 వేసుకొని  యిద్దరు  కలుస్తారు.  ఆమె కులుకుచూపులు  చూపిస్తుంది. 
 తెల్లవారబొయ్యేవేళ యింటికిబోయి యేమి యెరగన ట్లుంటుంది. కొన్నాళ్లకు 
 యిద్దరూ పెండ్లాడుతారు. తరుహిత  యిద్దరికి  వియోగం సంభవిస్తుంది. 
 యెఁకినౌయుడికోసం  రాత్రులయందు  యేటి  వోడ్డుకుపోయి  అతణ్ని
 లుచుకుంటుంది.  తరువాత  మళ్లీ కలుస్తారు. తిరుపతికి పోతారు. మళ్లీ 
 బిగ్గాగం ఇద్దరూ ఒకరికోసం  వొకరు  తాపపడతారు.  తిరిగి కలుస్తారు. 
 కోరోజుల్లో  కడుపుతో  వుంటావని  నాయు  డబటాడు. అందుకు నాకు
 ఇనాము  లియ్య  మంటాడు.  పుస్తకంలో కథ ముగుస్తుంది.
   శృంగారం అనే గ్రంథంలో ఒక్కొక్క కొన్ని కొన్ని పద్యాలు రచించారు."
 రజస్వల కాకముందే చన్నులువచ్చినవి."
   "జోడుగుండ్లబారననేద దోచే గొత్త చనులు" అని. 
   "సొంగు గుబ్బలకైక నేగదన్ని పయ్యంట." అని.