పుట:Neti-Kalapu-Kavitvam.pdf/182

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


147

శృంగారాధికరణం

ఈపూజాకుసుమములో నేయొకదానిని చిత్తగించి నను ఈనామాటలు అతిశయోక్తులు ఎంతమాత్రమునుగావని యెరుంగ గల్గుటయేగాకో అని యెంకిపాటల పీఠికాకర్త వ్రాశారు.

      "పాటలు అప్రయత్నంగావచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞడనా? ప్రోత్సాహముచేసి వీపుతట్టిన అదికార్లవారికా? కవితా కళా రహస్యాలు తెలియజెప్పిన మాబసవరాజు అప్పారాయనికా? మువ్వురకును."
  అని యెంకిపాటలకర్త యీయెంకిపాటల రచనవల్లకలిగిన సంతోషంలో కృతజ్ఞత యెవరికి చూపవలసినదీ తొచక కొంతసేపు అనిశ్చయంతో వున్నాడు.

"యెంకిపాటలు పదిమందికీ వినుపించినవారు దేశోధ్దారకులు శ్రీయుత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు. యీ పుస్తకం అచ్చులో యెంతో అభిమానంచూపి రెండుమాసములు తమ మూడు పత్రికలలోను ఉచితముగా అడ్వరుటైజుచేయునట్లు ఆర్డరు దయచేసినారు. వారి కెంతో కృతజ్ఞడను" "శ్రీశ్రీశ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దూరుగారు యీపాటలు విని ఆనందించేవారు. "ఆంధ్రపండిత మండలివారు నన్ను ఆహ్వానించి గౌరవించారు" "తర్కవ్యాకర్ణశాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులుగారు తమకు తామే కొరి యీపాటలు చక్కగా అచ్చువేయించినందుకు కృతజ్నుడను"

అని వారివారి పొగడ్తలను యెంకిపాటలకర్త వ్రాశాడు శృంగారమనే

ఒకపుస్తకం అచ్చువేయించిన జీ యస్ శాస్త్రి అండుకంపనీ తపాల పెట్టె 110 చిరునామాకల శ్రీగంటి సూర్యనారాయణశాస్త్రివారు "ప్రధమమునుండి నాకెన్నొవిధాల సహాయముచేయుచున్న శ్రీ దేశొద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారికి నాప్రణమాంజలి