పుట:Neti-Kalapu-Kavitvam.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ గణేశాయ నమః

వాఙ్మయ పరిశిష్టభాష్యం

శృంగారాధికరణం

అవునయ్యా. కొత్తగాకుంటే గాకపోనీయండి, సాధారణప్రజలు కాపులు నాయకులుగావున్న మాకావ్యాలకవిత్వం మంచిదంటారా?

వినిపిస్తున్నాను. ఈకవిత్వాన్ని యిక విచారణచేస్తాను. యెంకిపాటల నీచిన్నకావ్యాలకు మచ్చుగా దీసుకొని విచారిస్తాను. ఈ కాలపు కావ్యాలను చాలావాటిని పరిశీలించాను. వీటిలో శృంగారం ప్రధానంగా వున్నది. కనుక శృంగారవిచారణే యిక్కడ చేస్తాను. ఈ విచారణనే వీర్యానికి రౌద్రానికి అద్భుతానికి అట్లానే అన్వయించుకోవలెను. హాస్యం, భయం, భీభత్సం, కరుణం వీటికి యెటువంటి పాత్రలున్నా విరోధం లేదు గనుకను మామూలుమనుషులు సయితం యీ రసాదుల కావ్యాల్లో ప్రధానపాత్రలుగా వుండవచ్చును గనుకను వీటీని చర్చించడం మాని తక్కిన ఉదాత్తరసాలకు ప్రతినిధిగా శృంగారం తీసుకొని చర్చిస్తాను. ఆదిగాక యీకాలపు వనకుమారి, యెంకిపాటలు, ప్రణయాంజలి మొదలైనవాటిలో శృంగారమే వున్నది. వీటిని గురించి

"యెంకిపాట లనెడి ... కవితాకల్పప్రసూనముల విషయమునందు గూడ...

యెంకిపాటలు ఈ ఇరువదవశతాబ్దిని మన యీ ఆంధ్రవాఙ్మయ కల్పశాఖికను ప్రసవించిన సర్వాంగపరిపూర్ణ పరిణతీవిలసితంబు లగు దివ్యప్రనూనరాజములుగాని పూపబెడంగులపచరించు పసరుమొగ్గలు గావు... దివ్యతాపూర్ణములగు భావసీమలందు ప్రయత్న విశేషమును ప్రోదిచేయబడిన ప్రాభవసంపదల చెన్నలరారు పుష్పరాజములుగాని అంతంతమాత్రపు 'అరవిరు లెన్నటికిని గావు.. ఇంతయేలప్రియపాఠకులు