పుట:Neti-Kalapu-Kavitvam.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


xix

అని అనువాద విదానంలో ఉమాకాంతం గారి మర్గాన్ని పునరుద్టాటించారు.

 ఉమాకాంతంగారు వారి అనుయాయులు ఈ అభిప్రాయాలను ప్రచారం చేశారు. సంస్కృత వృత్తాలతొ పాటు తెలుగు పద్యాలను కూడా వర్ణమైత్రి లేకుండా ప్రయోగించారు. గీతాది లఘు పద్యాలను పాదాంత విరతిని మాత్రమే నియమంగా పాటించారు. పెద్ద పద్యాలలో పాదమద్య విరతిని కూడా పాటించారు.
 వీరంతా ముత్యాల సరాన్ని ఆదరించడం చారిత్రకంగా గుర్చించదగిన ఒక విశేషం అయితే వీరి రచనల్లో ఎక్కడా గురజాడ అప్పారావుగారిని విరివిగా స్మరించి నట్లు గాని (ఈ పుస్తకంలో ఒక్కచోట తప్ప) ముత్యాలసరం పేరును ప్రస్తావించినట్లు గాని కనపడదు. అయినా ముత్యాల సరాలను ధారాళంగా వాడారు. అదీ గురజాడ పద్దతిలోనే యతి ప్రాసలు నియమాలుగా కాక అలంకారాలుగా మాత్రమే పరిగణించిన అప్పారావు గారి మార్గం ఉమాకాంతం గారికి నచ్చినట్లు భావించవచ్చు భావకవులకూ ఉమాకాంతం గారికి ముత్యాలసరం  విషయంలో మాత్రం ఏకీభావం కనిపిస్తుంది. భావకవుల్లో రాయప్రోలు సుబ్బారావుగారు తల్లావజ్జుల శివశంకర శాస్త్రిగారి వంటివారు వర్ణమైత్రీయుత వళినిగాని ప్రాసముగాని ముత్యాల సరాల్లొ కూడా పాటించారు. కృష్ణశాస్త్రి గారి ముత్యాల సరాల్లొ వర్ణమైత్రి లేనివి కనిపిస్తాయి.
   ఉమాకాంతంఅ గారు ఆంధ్ర వాజ్మయాన్ని అంతటిని మాత్రపద్ధతిలో చెప్పదల్చుకున్నారు. ఈ మాత్రాలకు మళ్ళీతానే భాష్యం చెప్పదల్చుకున్నారు. అయితే చెయ్యదల్చుకున్నవన్నీ చెయ్యటానికి జీవితం చాలింది కాదు. వాజ్మయదర్శనము పేరుతో ప్రాచీన ఖండాన్ని తొమ్మిది భాగాలు (అలోకములు) గా మాత్ర పద్దతిలో ఉన్నాయి. ఈ మాత్రాలు చూస్తే చాలా విస్తృత ప్రణాళికనే వేసుకున్నట్లు తెలుస్తుంది భాష్యం