పుట:Neti-Kalapu-Kavitvam.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః

వాఙ్మయపరిశిష్టభాష్యం.

జానపదపాత్రాధికరణం.

పూర్వపక్షం

అవునయ్యా, శబ్దార్థాలను బట్టిగాని వస్తువునుబట్టిగాని, భావాన్నిబట్టిగాని, యికాలపు చిన్నకావ్యాలు కొత్తవిగాకుంటే కాకపోనియ్యండి. పాత్రలనుబట్టి కొత్తవి. యెందుకంటే యీచిన్న కావ్యాల్లో యెంకి, వనకన్య, యీతీరుగా పాత్రలున్నారు. పూర్వకావ్యాల్లో దుష్యంతుడు, యక్షుడు, పార్వతి, సీత, మాలతి యిట్లాటివాండ్లున్నారు. ఈకాలపువాటిలోసాధారణప్రజలలోనుండి పాత్రలను స్వీకరిస్తున్నారు. ఇదే వీటి కొత్తఅంటారా?

సమాధానం.

ఇక్కడ వినిపిస్తున్నాను. కొత్తది అయితే అవునుగాక. కొత్తదయినమాత్రాన మంచి దెట్లా అవుతుంది? స్వస్థతకంటె రోగంకొత్తది, నిర్మలంగా వుండడంకంటే పైన దుమ్ముపడడం కొత్త , ఇవన్నీ కొత్తఅయినా మంచివిగావని సాధారణబుద్దికే తెలుస్తుంది. కాళిదాసువంటి కవివుంటే యీకాలంలో

"నవీనమిత్యేవ న సాధు సర్వం".

అని చెప్పివుంటాడు. అనాగరకదశనుండి నాగరకదశకు వస్తున్న పాశ్చాత్యులకు నవీనం అనేది మంచిదిగా వుంటే వుండవచ్చునుగాని ఆధ్యాత్మిక తేజస్సు తపస్సుధర్మం వీటితోపాటు విజ్ఞానం కావ్యప్రస్థానం మొదలైన మానసజిజ్ఞాసలు వీటిలో ఉచ్చోచ్చదశనందిక్రమంగా క్షీణిస్తున్న