పుట:Neti-Kalapu-Kavitvam.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
139
భావకావ్యాధికరణం

హక్కువున్నది అది. సర్వ భారతజాతులకు పితృపైతామహమయిన ధనం. ఆది ,బంగాళీలది మహారాష్ట్రులది, వారిది వీరిది, నాదిగాదు, అని దానికి దూరమైతిమా, భారతీయసంస్కారవిహీనులమై భారతీయులలో అధమాధములం కాగలము. ఈ అధమాధమదతే నేడు ఆంధ్రులకు ప్రాప్తించింది. భారతీయుల మని అను కుంటాముగాని భారతీయ సంస్కారానికి అత్యంతం అంధులమైనాము. మన కిప్పుడు వున్న కొద్ది తెలుగుపుస్తకాల్లో వున్నదే భారతీయసంస్కార మనుకొని వంచితులమైనాము.

భారతీయసంస్కారం భారతీయసాహిత్య జిజ్ఞాసలు యీ అధమదశలో మన విశ్వవిద్యాలయస్థానాల్లో నశించినవి గనుకనే కుళ్లినప్పుడు పుట్టే పురుగులవలె పులుముడు, అయోమయం. చిల్లరశృంగారం మొదలైన వాటితోకూడిన కృతులుపుట్టి ఆ పురుగులవలె సంచరిస్తున్నవి వేదమంత్రాలవద్ద నుండి. వేమన సూక్తులవరకు. కురుక్షేత్రంవద్దనుండి కోరబొబ్బిలివరకు ఆంధ్రులజీవనస్రవంతి ఆనుస్యూతంగా ప్రవహిస్తున్నది పోనియ్యండి యీచర్చ అట్లావుంచి చూచినా వెనకటి తెలుగు-కృతుల కంటె యిప్పటి వేమాత్రం-ముంచిదశలో లేవు మను, వసుచరిత్రలు అధమకావ్యాలయితే ఈవులుముడు అయోమయం శబ్దవాచ్యత మొదలైన దోషాలతో, అంతకంటే అధమాలై చిల్లరశృంగారంతో కూడివున్నవి గనుక యిప్పటికృతు , లేవిధంగాను మంచిదశలో లేవు.. భావం వ్యక్తమయ్యే కావ్యం భావధ్వని ఆని, భావకావ్య మనీ వ్యపదేశం పొందుతున్నదని, విశదీకరించాను.


"రతీర్దేవాదివిషయా" (కావ్యా)


అని మమ్మటుడన్నాడు


దేవమునిగురువిషయా చ రతి:" (సా.మి)

అని సాహిత్యదర్పణకారు డన్నాడు