పుట:Neti-Kalapu-Kavitvam.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
               భావకావ్యాధికరణం         137
                పూర్వపక్షం.
    అవునయ్యా; కవిత్వమెక్కడవుంటుందో భావమక్కడవుండడం 
    వాస్తవమైతే కానియ్యండి. యెవరేమన్నా లిరికల్ కవిత్వమని
    వొకశాఖపాశ్చాత్యవాజ్మయంలో ప్రత్యేకంగా యేర్పడివున్నది. దానిలో
    భావోద్రేకం ప్రధానం. అవి చిన్నవి. వీటిననుసరించి మేమిప్పుడు "
    భావకవిత్వమనే వోకశాఖను ప్రత్యేకించాము. ఇట్లా భావకావ్యాలనే
    పృథక్శాఖయిదివరకు మన వాజ్మయంలోలేదు. భావకావ్యమనే పేరే
    యిదివరకు లేదు. ఇదే నూతనత్వం అని అంటారా.
                సిద్ధాంతం.
     చెప్పుతున్నాను.  పూర్వపక్ష  తటస్థాక్షే పాలకు కలిపి సమాధానం
    వివరిస్తాను. కవిత్వ   మెక్కడవుంటుందోభావ   మక్కడవుంటుందనే 
    మాట వాస్తవమేను. భావకవిత్వం భావకావ్యం అనడం అసంగతంకాదు.
    మనపోజ్మయంలో  భావకావ్యం  అనే  పృథ్ళఖలేదనీ, అందువల్ల
    నూతనమని అనడం మిక్కిలి అసంబద్ధం. భావకావ్యం అనేది చాలా
    ప్రాచీనమయినది. అది మనవాజ్మయంలో చిరకాలంనుండి వుంటున్నది. 
    శిశుదేవజడప్రకృతివిషయమైన ప్రేమ విషాదాదులు సాహిత్య  శాస్త్రంలో 
    భావసంజ్ఞను  పొందుతున్నవి.  భానమంటే ముందు  వివరిస్తాను.
    ఇట్లాటిభావం యెక్కడ ప్రధానంగా  వ్యంగ్యమైవుంటుందో   దానికి
    భావధ్వని అనిపేరు.
       "రభావతదాభాస భావశాంత్యాదిరక్రమః"        (కావ్య.) 
    అని మమ్మటుడు.
    "అక్రమః "  అంటఅసంలక్ష్యక్రమవ్యంగ్యధ్వని  అని అర్థం, రసం
    ప్రధానంగావుంటే రసధ్వని  అని, భావం ప్రధానంగావుంట భావధ్వని
    అని యీతీరున కావ్యవ్యపదేశాలు.