పుట:Neti-Kalapu-Kavitvam.pdf/170

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


135

భావకావ్యాదికరణం

     యీతీరుగా చిన్నకావ్యాలు విభాగరహితమైనవి మనవాజ్మయంలో చిరకాలంనుడి వున్నవి కనుక ఆకారంచేత యిప్పటి చిన్నకావ్యాలు కొత్తవికావు.

పూర్వపక్షం

    అవునయ్యా ఆకారంచేత కొత్తవికాకుంటే పోనియ్యండి వనకుమారి యెంకిపాటలు మొదలైనవ్చి బావకవిత్వం అది కొత్తది యిది వరకు లేదు. ఇంగిలీషులో లిరిక్సునుచూచికొత్తగా యిప్పటివారు నిర్మించినది భావకవిత్వం.

తటస్థాక్షేపం

   భావకవిత్వం మనడమె అసంగతం శ్రీకాశీభట్ల బ్రేహ్మయ్యశాస్త్రివారు వ్రాసినట్లు భావంలేనిది కవిత్వమే లేదు. కవిత్వ మెక్కడ వుంటుందో భావ మక్కడ వుండనే వుంటుంది.
     సర్గబంధంలేని చిన్నకావ్యాలు చిరకాలంనుండి మనవాజ్మయం లో వుంటున్నవి ఘటకర్పరకావ్యం సూర్యశతకం,బిల్హణకావ్యం సౌందర్యలహరి, కాళహస్తీశ్వరశతకం ఇవన్నీ యీకోటిలోని వీటికే మన పూర్వులు ఉపకావ్యాలని ఖండకావ్యాలని పేరుపెట్టినారు.

"అసర్గబంధమని యమపకావ్యముదీర్యతో (ప్రతా)

అసర్గబంధం సూర్యశతకాది అని చ్విద్యానాధుడన్నాడు.

"ఏకార్ధప్రవణై: పద్యై: సంధిసామగ్ర్య్లవర్జితం.
ఖండకావ్యం భవేత్ కావ్యస్తైకదేశానుసారిచ" (సాహి)
    (ఏకార్ధప్రవణమై సంధిసామగ్ర్య్లరహితమైన పద్యాలసముదాయానికి కొన్ని లక్షణాలు తగ్గినకావ్యానికి ఖండకావ్యమని పేరు)

"యధా బిక్షాటనం ఆర్యావిలాసశ్చ" (సాహి0