పుట:Neti-Kalapu-Kavitvam.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xviii


నట్టు 'లక్ష్యఖండం' అనే పేరు పెట్టడం లోనే తెలుస్తున్నది. ఉమాకాంతం గారు రఘువంశ పీఠికలో-

మూలమున లేనట్టిదానిని
వ్రాయననపేక్షితము చెప్పను
అన్న నాథుని మాట దలచగ
అర్హుడనొ కానో!

అన్నారు 'మూలంలో లేనిది చెప్పను. మూలంలో ఉద్దేశించనిది కూడా చెప్పను' అన్న మల్లినాథసూరి మాట తల్చుకున్నారు. ఆయన్ననుసరించి ఆలంపూరు కృష్ణస్వామిగారు --

'వదలి మూలస్థమ్ము లేనిది
కుక్కి అనువాదమ్ము చేసెడి
ఆజ్ఞ మార్గము తొలగిపోవుత
నాకు గురువుల కరుణచే' -- అన్నారు

ఇక్కడ 'గురువులు' అనే మాటలో ఉమాకాంతం గారిని ఉద్దేశించినట్టు భావించవచ్చు.

ఈ మార్గం లోనే కన్నెకంటి ప్రభులింగాచార్యులు గారు కాళిదాసు కుమార సంభవాన్ని అనువదిస్తూ

ఆర్ష భూయస్త్వోత్తమములగు
కాళిదాస కవిత్వవిధులను
మా కొసంగిన మల్లినాథా!
నిన్ను వినుతింతు

అని మల్లి నాథుని ప్రశంసించి --

విడువగా రాదున్నదానిని
లేనిదానిని కుక్కగూడదు
ఇదియె అనువాదాల తెరువను
ప్రవచనమ్ము తలంచెదన్