పుట:Neti-Kalapu-Kavitvam.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
                    వ్యతిక్రమాధికరణం            133
           ఛందోవ్యతిక్రమం ఈ కాలపుకృతుల్లో అట్లానే నిల్చినవి. యతిభంగాన్ని,
           పాదభంగాన్ని ఛందోవ్యతిక్ర మంలోనే చేర్చి  యీమూటినీ   నేనిందు 
           ఛందోవ్యతిక్రమ  మనివ్యవహరిస్తున్నాను.  ఇవి   కాలపుకృతులను
           మలినపరుస్తున్న  సంగతిని  విశదంచేశాను.  ఈ  ఛందోవ్యక్రమం
           యేతీరుగా దోషమై ఆంధ్రుల భాషాసంస్కారాలకు అడ్డుపడినదీ, నన్నయ
           ఆరంభించిన  భాషావ్యతిక్రమాన్ని  దండగ్గణాలను   నిరోధించదలచీ 
           తిక్కన యెట్లా ప్రతిక్రియనడిపిందీ, ప్రక్రియలో అత డెట్లా   పాదభంగఁ 
           యతీభంగం విరివిగాచేసిందీ, చివరకు రేక్కంపమీద  నడిచేమనికసి
           ముండ్డుతప్పించుకో లేనట్లు ఆదోషాల కెల్లా పాలుపడ్డదీ ప్రథమఖండంలో
           విపులంగా  మీమాంసచేశాను  గనుక యింతటితో   వ్యతిక్రమదోష
           విచారణ  చాలిస్తాను. అనుప్రాసాది శబ్దాలంకారాలవలే   స్వయంగా 
           ఆపతీతమైన స్థలాల్లో తప్ప తక్కినచోట్ల వళిప్రాసల   నిర్బద్ధమైత్రులు 
           పాదభంగ  యతీభంగాలు, దండగ్గణాలు మొదలైన  క్షుద్రలక్షణాలకు 
           హేతువలై పద్యాన్నీ  కలుషితంచేశేవి గనుక  అవి అట్టాటి  చోట్ల 
           అత్యంతం హేయమని ఛందోవ్యతిక్రమం దూష్యమని దీనివల్ల పద్యం
           భ్రష్ట మయిందని  యిప్పటి కావ్యాల్లో మీ రనుకొన్న కొత్త లేక పొయినా
           యీదోషాలు  కావ్యాలను  వికృతంచేస్తున్నవని  మరల చెప్పి యిక
           కావ్యజీవవిచారణ ప్రారంభిస్తాను.


              అని శ్రీ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాజ్మయసూత్ర
                
                 పరిశీష్టంలో వ్యతీక్రమాఫీకరణం సమాప్తం.