పుట:Neti-Kalapu-Kavitvam.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యతిక్రమాధికరణం

131


కొనియేఁ బురోహితత్వమును గొంకక శ్రీశుని జూచుకోరికన్,"

"ఘోరరణోత్సుకుం గాంచినాడఁ- జూ,"

నిరతము సత్యవాక్కులననె నెమ్మి వచింపుచు శాస్త్రరీతులం

గరము నెఱింగి."
 
"ధరణీపాలక చంద్రుఁడీతఁడు, కృపం దాఁబూని యుర్వీజనో

త్కరమున్, రంజిలంజేయుచున్ జగతి జక్కంగాంచె.

"గనియెడు దృష్టిపాటవము. కన్నన దగ్గెను"
 
"యన్నరో వెన్నకన్నననయంబు మృదుత్వము గాంచుగాన నే

మన్నన గాంచెలోకమున మానిత పండితపొలిచే 'దరస్."
 
వీరకానన సముదయ నీతి: హోత్రు

డానతామర్త్యసముదయుం డట్టి పరశు."

"జనిఫలియించునంచెపుడు స్వాంతమునన్ దలపోయుదానఁజూ"

(జనమంచి శేషాద్రిశర్మకృతి, విచిత్రపాదుకాపట్టాభికే కం).

అని యిట్లావ్యాపించి వికృతరూపం చూపుతున్నవి

"వనరాజిపల్వలం "సపల్వలో త్తీర్ణవరాహ యూధాన్యావాస
 వృక్షోన్ముఖబర్హిణాని" "ప్రసీదశశ్వన్మలయస్థలిషు"

అని ప్రసక్తంగా వుచితమైనచోట్ల యివివుంటే రోతగాదుగాని అయినచోటా కానిచోటా దండగ్గా సమయాన అసమయాన వీటిని గుప్పించడం జుగుప్సకు హేతువగుతున్నది. ఇట్లాటి దండగమాటలు అ ప్రసక్తంగా యెక్కడవున్నా నింద్యమే అవుతున్నవి.