పుట:Neti-Kalapu-Kavitvam.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


126

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

"త్రేతాద్వాపరసందిమద్దతమదాంధీభూతవిద్వేషిజీ.
మూతవ్రాత" (బా అ)

     భారతంలో ఆరంభించిన యతిభంగ దోషం యిట్లా నేటికి దూరంగాక తెలుగుపద్యాన్ని వికృతంచేస్తున్నది.

పాదభంగం

   వృత్తాన్ని పదచ్చేదయుతమైన పాదాలుగా విభజించి ఒక్కొక్క పాదం ఒక్కొక్క భాగంగా పింగళాదు లేర్పచడంలొ పద్యంయొక్క గతివిశేషం అర్ధప్రదత్వం శ్రావ్యత్వం మొదలైనగుణాలు పుష్టమవుతున్నవి. కనుకనె పాదాంతయతి నియతంగా భారతీయచ్చందోవేత్తలు పరిగణించారు. కాని యీపదసౌందర్యం నన్న యభారతంలోనే లుప్తమైంది.

"విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండుకృ
ష్ణద్వైపాయనుల్ డేగుదెంచె" (స.భా)
"విధ్యుద్దండము నిల్చి పాల్చినగతి న్విల్లందమైయుండ న
న్మద్యోధావలి మానసంబున రణోత్సాహంబు రెట్టింపదృ
ష్టద్యుమ్నుండు" (తి. భా)
అని యిట్లా భారతంలో అరబ్ధమైన పాధభంగం
"నాదేశంబున వేరుపాతుకొనె సంఘప్రస్ఫుటాదారర
క్షాదీక్షాపరతంత్రబుద్దిలత" (జీవితాదర్శం).
రేఖామంజుల వాసనాలహరి పర్వెన్ ప్రాతరానీతశో
భాఖద్యోత విలాసరాగలలితప్రాంశు"

(అనార్కళి. భారతి)

అని యిట్లా యిప్పటికె గోచరిస్తున్నది. పద్యాలు పాదసౌందర్య హీనమైనవి కొన్ని పొడుగైన వొంటికాలిమనిషివలె చాంతాడువంటి