పుట:Neti-Kalapu-Kavitvam.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


125

వ్యతిక్రమాధికరణం

మారంభమైనప్పటినుండి అడుగడుగుక్కూ వక్ష్యమాణాధికపదదోషంచేత దూపితమైన దీర్ఘవృత్తాలుశరణమై క్లుప్తంగా వ్యంగ్యవిభుత్వంతో రచించే ఉత్తమమకవితామార్గానికి అంధులమై మనకు పద్యం వ్రాయడమే కవిత్వమయింది. ఇప్పటికి పద్యం వ్రాయడమే మనకు కవిత్వంగా వున్నది. గీతం, ద్విపద, రగడ, ఉత్కళిక మొదలైన వాటిని కొందరుల్ వాడుతున్నా సంస్కృవృత్తాల నింకా వదలల్వేదు. సంస్కృతంలో మందాక్రాంత, శార్ధూలంవంటి వృత్తాల్లోనే కవితాశిల్పానికి భావం కొంత దీర్ఘంగా కనబడుతుంది.

      మన సీసపద్యపు నాలుగుపాదాలమటుకే మందాక్రాంతకుగాని శార్ధూలానికిగానిసరిపోతవి ఇంకా సీసానికి గీతపాదాలు నాలుగు తగిలిస్తే భావం మిక్కిలి దీర్ఘమై అప్పుడు కవితచ్చాయపోయి ఉపన్యాసధోరణిలోకి  దిగితుంది. ఒక్కొక్కప్పుడు పద్యమెక్కువై దండగమాటలు నింపవలసి వస్తున్నది. శార్హూలాదివృత్తాలతో నిండివ్చున్నమన తెలుగుకృతుల్లో చందోవ్యతిక్రమం ఉదాహరించడం అనావశ్యకం గనుక ఉదాహరణాలను చూపక వదలుతున్నాను.

యతిభంగం

      యతి అంటే విచ్చేదం సీసంవంటి దీర్ఘపద్యపుపాదాల్లోశ్రోతకు శ్రవణసుఖాన్ని పఠయితకు యత్నసుఖాన్ని యతి ఆపాదించి పద్యం యొక్క శ్రావ్యతకు సుగ్రహతకు మిక్కిలి తోడ్పడుతున్నది. ఈసంగతి సీసం, శార్ధూలం, మందాక్రాంత మొదలైనవాటిని పఠించి కనుక్కోవచ్చును. కనుకనే ఉచితస్ధలాల్లో యతిని ఉపదేశించిన భారతీయచ్చందోవేత్తలు పద్యరమ్యతను ప్రతిస్ధించారంటున్నాను.
    ఇట్లాటి యీనియమంనుండి తెలుగుపద్యం భారతంలోనే చ్యుతమై యిప్పటికి నియమహీనంగానే వుంటున్నది.