పుట:Neti-Kalapu-Kavitvam.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


xvii

2. అది గణాల ఆరోహణావరోహణల వల్లనే సిద్దిస్తున్నది.

3. అక్షర వినోదం (వళిప్రాసలు) శబ్దాలంకారాల్లో చేరినది.

4. శబ్దాలంకారాలు అలంకారశాస్త్రంలోనిది.

5. శబ్దాలంకారాలు స్వయంగా అపతితమైతేనే తప్పు అవశ్వకంగా స్వీకార్యం కావని వీటిని ప్రధానంగా స్వీకరిస్తే కావ్యం అధమ మవుతుందని సాహిత్య వేత్తల మతం.

6. అర్ధరస్ మానుగ అనఘ అమల ఓలి, ఒగి వంగు చెన్నుగయిట్లాటి దండగ చెత్తను లేదా యతి భంగానికి హేతువై అనర్ధప్రదం కావటం వల్ల అక్షరాల ఆట (పళి ప్రాసలు) అవశ్యకంగా ఉపాదేయంగాదు.

7. యతి అంటే విచ్చేదం వాగింద్రియ విశ్రాంతిని త్రావ్యతను పద్యం యెక్క మనతత్వ రమ్యత్వాలను సిద్దింపచేస్తుంది గనుక దీర్ఘ పాదాల్లొ మధ్య యతీ పర్వత పాదాంత యతీ నియతం.

8. పద్యం గానీ పద్యాలు గానీ శీఘ్రంగా గాని విలంబంగా గాని అల్లిన మాత్రాన విద్యుకర్త అవుతాడు కవికానేరడు. విద్యద్గోష్టుల్లొ శాస్త్రాబ్యాసజన్యం విజ్ఞానం

9.అన్మాంతర సంస్కార రూపమైన ప్రతిభ విద్యద్గోష్టుల్లో ఉత్తమ విజ్ఞాన లబ్ది చరాచరలోకప్రభావ పరిశీలనం కావ్యజ్ఞ శిక్ష కావ్యత్వహేతువని మమ్ముటుడు.

10. విద్యరూపానగాని గద్యరూపానగాని అనువాదం చేస్తే అనువాది కాగలడుగాని కవి కాజాలడు. రసభావ విష్పాదక మైన సృష్టికి సంబందిచినది కవిత కొంత తీసివేసి కొంతచేర్చి అనువాదం చేస్తే అప్రశస్తాను వాది అనూదిత కావ్యంలో సృష్టివిశేషాదులు అనువాదిని కాజాలవని స్పష్టం.

   వీటి అధారంగా ఆయన అనుయాయులు కొందరు అనువాదాలు సాగించి ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసినట్టు కొమరవోలు చంద్రశేఖర మంత్రిగారు ప్రకటించిన లక్ష్యఖండం (1937) వల్ల తెలుస్తుంది ఉమాకాంతం గారి లక్షణాలకు వీరు రచించిన లక్ష్యాలని వీరుద్దేశించి