పుట:Neti-Kalapu-Kavitvam.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


తపస్సంపత్తి, సందేహావతారము, సంశయావతారము, శుభకర, శుభంకర. అపారసాహాయ్యము, వారాణసీ, వారణసి, ఉపాధ్యాయలు, ఉపాధ్యాయానులు, ప్రబంధప్రణీతృపథమును, యశుద్ధతి, సత్సాహాయములు, శిరఃపాళీ, దారపుత్ర, ప్రాధాన్యము. నరసింహావతారము, బిడౌజోముఖ, మహిమ సర్వస్వము, మనఉచ్ఛేదము, మనశ్ఛేదము, తపఉక్తుల్. ప్రేమపుష్ప, శ్రీశైలము, శ్రీపర్వతము, ఐక్యగతి, మత్సిభంగి, కళాసాహాయ్యమున, ప్రేమమహితాంతరీపమున దారపుత్ర, మనఉద్వేగ అని వుండవలెను. ఇంకా శిరచ్ఛేదం. ప్రభ్విణి, సరోజని మొదలైనవెన్నో అనేక గ్రంథాల్లో పత్రికల్లో వున్నవికాని విస్తరభీతిచేత వాటిని ఉదాహరించక వదలుతున్నాను. ఇక తెలుగులో అరసున్నలు గజడదబలు గసడదవలు, మొదలైనవికారాలు వెనకటివలెనే వున్నవి. పాతబడ్డ తుప్పుమాటలు మూలగొట్టుమాటలు మాత్రం లేక భాషయిప్పటికృతుల్లో ప్రసన్నత్వానికి వచ్చింది. ఈదశ శ్రీనాథాదుల కృతుల్లో. కృష్ణకర్ణామృతం, భర్తృహరిత్రిశతి, వేమనశతకం మొదలైన వాట్లో వున్నాయిప్పుడు సాధారణమైంది. ఇది సంతోషహేతువేగాని. పులుముడుమొదలైన దోషాలకాకరం కావడంవల్ల అది అచరితార్థమవుతున్నది.

ఛందోవ్యతిక్రమం.

గుర్వంతపాదాలూ, గుర్వక్షరబహుళాలూ, అయినా శార్దూలం మత్తేభం మొదలైన సంస్కృతవృత్తాలు తెలుగుభాషాతత్వాని కెంతమాత్రం అనుకూలమైనవి గావు. వీట్లో తెలుగుపద్యాలు వ్రాయడం ఛందోవ్యతిక్రమ మవుతున్నది. ఈఛందోవ్యతిక్రమమే భాషావ్యతిక్రమానికి హేతువు. ఛందోవ్యతిక్రమం భాషావ్యతిక్రమాన్ని భాషావ్యతిక్రమం ఛందోవ్యతిక్రమాన్ని పరస్పరం పెంచుకుంటూ వుండగా ఈ రెండూకలిసి తెలుగుభాషను ఛందస్సును వికృతంజేసి తద్వారా విజ్ఞానవికాసానికి అడ్డుపడుతూ ఆంధ్ర జాతిని వంచిస్తున్నది. భారతంలో యీ వ్యతిక్రమ