పుట:Neti-Kalapu-Kavitvam.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


116

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

ఆక్షెపం

      అవునయ్యా యిట్లాటిదోషాలెన్ని వున్నా ఇప్పటి కాలపుకవిత్వం విలక్షణమైనది. వెనుకటికవులు ఆశ్వాసాలని వర్గలని కావ్యవస్తువును విభజించి పెద్ద పెద్ద కవ్యాలువ్రాసేవారు. ఇప్పటికవులు బావమే ప్రధానంగా చిన్నచిన్నకవ్యాలు వ్రాస్తున్నారు. ఇవి యింగిలీషు లిరెక్సు (Lyrics) నుబట్టి వ్రాసినవి. వీటిలో భావోద్రేకం ప్రభావం ఇవి వెనక మనకు లేవు. ఇప్పటికవుల చినకవ్యా లీలిరిక్యులకు చేరినవి. ఇదే భావకవిత్వం. ఇది కొత్త ఈకొత్తయే ఒకగొప్పగుణం. దోషాలన్నీ దీంట్లో అణగిపోతవి అని అంటారా?

సమాధానం.

   చెప్పుతున్నాను, అది అసంభద్ధపుమాట భావకావ్యాలు మనకు చిరకాలంనుండివున్నవి. యెకభావాన్ని ప్రధానంగా ప్రతిపాదించే చిన్న కావ్యాలు మన వాజ్మయంలో చిరకాలంనుండి వున్నవి. ఈ సంగతి విశదపరేచడానికి ముందు ఈ కాలపు కావ్యాల్లో వున్న భాషావ్యతికంచ్చందోవ్యతిక్రమాలను గురించి కొంతవిశదం చేస్తాను.
    అని శ్రీ ఉమాకాన్త్గ విద్యాశేఖరకృతిలో వాజ్మయసూత్ర పరిశిష్టంలో దృష్టివిచారాధికరణం సమాప్తం