పుట:Neti-Kalapu-Kavitvam.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


113

దృష్టివిచారణాధికరణం

  పద్యం అనర్ధంగా వుండగూడదుగదా ఆలంబనలేని స్థితిహీనమై అనన్విత మవుతున్నవి. యెవరైనా కృతికర్త ఆ "నేనూ కు అర్దంతానుగాదంటే యెవరోచెప్పమంటాను అప్పుడాలంబనం యొక్క మచిచెడ్డలు విచారిస్తాను.

పూర్వపక్షం

    అవునయ్యా ఇదే ఇప్పటివారిస్వేచ్చ పాత్రలను సృష్టించకతమను గురించే వ్రాసుకుంటారు ఇట్లా పాశ్చ్యాత్యులు వ్రాస్తారు; అని అంటారా?

సమాధానం

   చెప్పుతున్నాను పాశ్చాత్యులు అనేకులిట్లా ఆత్మనాయకత్వంలో చాటుపద్యాలవంటివి చిన్నవి పెద్దవ్చి కృతులు వ్రాస్తున్నారని నే నెరుగుదును యెవరువ్రాసినా సత్యాన్ని తిప్పజాలవు. ఇట్లాటివి ఒకిఅ తీరుకవిత్వం అంటే నాకు విప్రతిపత్తి లేదు. అనుభవకవిత్వం  ఆత్మనాయకకవిత్వం అని యేదో దానికి పేరుపెడతాముఇ. కాని యిదివరకెవరూదీన్ని యెరగరని ఇది కొత్త అని, ఇది స్వేచ్చ అని స్వేఛ్ఛాకుమారుడని ఇది మహాకవిత్వమని అంటే అది కాదని దృష్టిసంకోచమని చెప్పుతున్నాను.

పూర్వపక్షం

  అవునయ్యా వీరు తమతమ అనుభవాలను వ్రాసి పెట్టుతున్నారు. వీరి చరిత్రలు శాశ్వతంగా లోకంలో వుంటవి వెనకతీవాండ్ల చరిత్రలు తెలియక చిక్కుపడుతున్నాము గదా వీరా చిక్కు తొలగిస్తున్నారు. వీరి చిత్తవృత్తి యిట్లాటిదని లోకానికి తెలుస్తుంది అని అంటారా?