పుట:Neti-Kalapu-Kavitvam.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
111
దృష్టివిచారాధికరణం


"నడికిరేయిని కలలోన నాకు నీవు
 కానిపింపంగ మేల్కొంటికలతచెంది" (భారతి 2-7)

"నాదు ప్రేయసిం గూడి నేనడువ"

(పయిడిపాటి చలపతిరావు. భారతి2-11)"భయము నాకేల యింత విశ్వమ్ములోన"

(భ.రామసోమయాజులు ఆంధ్ర హూల్డు 1-2)"ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను" (కృష్ణపక్షం)

"విబుధులెల్లరు నన్ను విడిచిపోయినను
 హితు లందరునునన్ను వేసగించినను
 నాప్రేమభాగ్యంపు నవ్వువెన్నెలలు
 నాపైన ప్రసరింప నాకేమిభయము"

(గ. రామమూర్తి, భారతి 2-11)

ఈతీరుగా వీరి దృష్టి సంకుచితమై వీరికి ఉండదగిన భావాలే మవుతున్నవి. నాజీవితం నాప్రేమ నాజానకి మనమిద్దరమైక్యమౌదామె అని వీరి స్త్రీ తప్ప వీరికి మరివిశాలదృష్టే కనబడదు. లోకం వీరికి అవిదితమై కూపస్థమండూక సాదృశ్యం పొందినారు.

ఆక్షేపం

అవునయ్యా. అని వారిని గురించిగాదు మరి యొకరినిమనసులొ పెట్టుకొని ఆరు అన్నట్లు వ్రాస్తున్నారంటారా?

సమాధానం

అది అసంబద్ధం వారెవరో యెందుకు చెప్పగూడదు? యెందుకు వ్యంగ్యంగానైనా తెల్పగూడదు? ఆమనస్సులో పెట్టుకొన్నది రావణుడూ