పుట:Neti-Kalapu-Kavitvam.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

దృష్టివిచారాధికరణం.

సంకుచితత్వం

లోకం వివిధప్రకృతులతో విచిత్రమైన వున్నది., కవి తనమనో విభుత్వం వల్ల ఉన్నతాలు ఉత్తమాలు అయిన ప్రకృతుల్లో ప్రవేశించి అంతరవీక్షణం చేసి ఈ ప్రకృతుల ప్రవృత్తులను లోకానికి ప్రసాదిస్తున్నాడు. అందుకే ఉత్తమపాత్రలను లోకానికి ప్రసాదిస్తున్నాడు. అందుకే ఉత్తమపాత్రలను కల్పించి మధ్యమాధమ పాత్రలవికృతత్వాన్ని ఉత్తమత్వస్ఫుటత్వానికి అంగంజేసి వారి రీతులను లోకాభ్యుదయదృష్టితో తెలుపుతున్నాడు. ఈతీరుగా కవి సంసృతిమిక్కిలి విశాలమై ఉన్నతమై వున్నది. ఇప్పటి కృతికర్త లనేకులు "చిన్ననాపొట్టకు శ్రీరామ రక్ష" అని శృంగారం మొదలైనవి యితరుల కెందుకు పోనియ్యవలెనని నాజానకి అని, నాప్రియురాలు అని, నా ప్రేమ అని నన్ను చిటికేసి సావిట్లోకి రమ్మన్నదని తమనే నాయకులను జేసుకుంటున్నారు.

"త్రోవలో దాని (ప్రియురాలి)రసన కంటకొనిపోదు"

(నాయని సుబ్బారావు, భారతి. 1-7)



"ప్రియతమావేరు చింతల విడిచి తడవు
 సేయ కిక నన్ను నక్కునజేర్చుకొనుము"

జంధ్యాల శివన్న శాస్త్రి



"కన్నులరవిప్పి నే నిన్ను గాంచినపుడె
 ఆర్ద్రహృదయంబుచలియించి యవశమాయె"

(పాపినేని వెంకటేశ్వరరావు)