పుట:Neti-Kalapu-Kavitvam.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

వాఙ్మయ పరిశిష్టభాష్యం నేటికాలపుకవిత్వం


ఈర్ష్యామానమని మానం రెండు విధాలని అభిప్రాయం కోపపరతంత్రులైన నాయకులబెట్టు ప్రణయయమానం

"ప్రేమపూర్వకవశీకారః ప్రణయః" అనిధనికుడు ప్రణయాన్ని భంగం చేసేమానం ప్రణయమానం. ఇదే ప్రణయకోపం

"త్వామాలిఖ్య ప్రణయకుపితాం" (మేఘ) అని కాళిదాసు

"ప్రణయ కుపితాం దృష్ట్యా. అని వాక్పతిరాజు (దశరూపక వ్యాక్యలో ఉదాహృత్రం)

"ప్రణయకుపితయోర్ద్వయోః" (సంస్కృతచ్ఛాయ)

అని దశరూపక వ్యాఖ్యలో ఉదాహృతం

ప్రణయమనేది కేవలం స్త్రీ పురుషుల స్నేహమే గాదు. సాధారణస్నేహం. స్త్రీ పురుషుల ప్రీతిమాత్రం గాదు. సాధారణ ప్రీతి అయితే యెక్కువైన ప్రేమను ప్రణయమంటారు. 'ప్రేమనీతం ప్రకర్షం చేత్ తదా ప్రణయ ఉచ్యతే" అని అభియుక్తోక్తి. ఇది స్త్రీ పురుషుల ప్రేమకు మాత్రం సంబందించింది గాదని యిదివరకే తెలిపినాను. కాని యిది తక్కిన ప్రేమలనువలె స్త్రీపురుషులకు సంబందించిన ప్రీతిని సయుతం తెలుపుతుంది. గనుక ఆ అర్ధంలో సయితం పీతిప్రభృతి శబ్ధాలనువలె విజ్ఞులు వాడినారు.

"మునిసుతాప్రణయస్మృతిరోధినా
 మమచ ముక్తమిదం తమసా మనః" (శా-6)

(శకుంతలా ప్రణయాన్ని ప్రీతిని స్మరించకుండా చేసే తమస్సు నుండి నా మనస్సు విడుదల పొందింది) అని

"మయ్యేవ విస్మరణదారుణచిత్తవృత్తౌ
 వృత్తం రహః ప్రణయమప్రతి పద్యమానే" (శా-5.)

(రహస్యంగా జరిగిన ప్రణయాన్ని (స్నేహాన్ని) తెలుసుకోలేని విస్మరణదారుణచిత్తవృత్తుడనైన నాయందే)