పుట:Neti-Kalapu-Kavitvam.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్ధవాచ్యతాధికరణం

103


అని శబ్దవాచ్యతతో పులిమినారు ఇందులో 7 ప్రణయలు వదిలిపెట్టి తక్కినవి వ్రాశాను. అయోమయం, పులుముడు, శబ్దవాచ్యతచేరి కవిత్వం పోగలిగినంత అధమదశకు ఈ పంక్తులు పోయినవి. ఈ తీరును యీపని యీ కాలపుకృతుల్లో మిక్కుటంగా కనబడుతున్నదని. యిది వివేకం మాలిన పని అని చెప్పి యీ ప్రస్తావన చాలిస్తున్నాను.

"బహుళ పక్షపు రాత్రినిబోలి చెవులకు పుర్రెలు వేలాడుతుండగా పురుషుల పేగులు మొలతాడుగా తాటకి నిల్చున్నది" అన్నప్పుడు యెవరెంత వద్దని చెప్పినా అది భయంకరంగా వున్నదను కొంటాము. కాని కృష్ణపక్షకర్త

"శోకభీకరతిమిర లోకైకపతిని"
"ప్రళయ ఝుంఝూ ప్రభంజనం స్వామిని"

అని అంటే యెవరెంత చెప్పినా, ఆయన ఆస్వామి అనిలభీకరపతి అని అనుకోలేకుండా వున్నాను. యెందుకంటే ఆయన యెందుకు ప్రభంజనస్వామో యెట్లా భీకరపతో తెలియదు. కనుక వీటిని దండగ మాటల శబ్దవాచ్యత అంటున్నాను. ఇక మధురత్వం మంజులత్వం వున్నచోట్ల మధురం, మంజులం దివ్యం అని మధురపైన మంజుల, మంజులపైన కోమల, కోమలపైన కమ్రవేస్తుంటే నేను తెలివిగలవాడను నేను మేధావంతుడను నేను గొప్పవాణ్ని అని చెప్పుకొన్నప్పటివంటి వెగటుపని గనుక అది వెగటు శబ్దవాచ్యత అంటున్నాను. ఈ ఉభయ విధ శబ్దేవాచ్యతలు ఈకాలపు కృతుల్లో వున్నవి. ఇంకొక మాట చెప్పి యీ విషయం ముగిస్తున్నాను. ప్రణయమనేది కేవలం స్త్రీ పురుషుల అన్యోన్యాభిలాషకు వాచకమని నేటి కృతికర్తలనేకులు అనుకొంటున్నట్లు కనబడుతున్నది. ప్రణయమంటే ప్రీతిపూర్వకమైన ప్రార్దన. సాధారణంగా ప్రేమ, స్నేహం అని అర్ధం అంతేగాని స్త్రీపురుషులకు ప్రత్యేకించి వుంటే స్నేహం మాత్రమేగాదు. సాధారణస్నేహం ఇది సాధారనంగా అనేక స్థలాల్లో నాయక వ్యవహారంలో కోపంతో అనుబద్ధమై వుంటుంది. "మానోపిప్రణయేర్ష్యయోః" అని దశరూపకారుడు ప్రణయమానమని