ఈ పుట అచ్చుదిద్దబడలేదు
101
శబ్దవాచ్యతాధికరణం
అని యీతీరున శబ్దవాచ్యత మిక్కిలి మెండుగా కనబడుతున్నది. తాటక ఘోరంగా రామలక్ష్మణులు యెదుట నిల్చున్నస్ధితిని
"జ్యానివదమధ గృహ్నతీతయో।
ప్రాదురాన బహుశక్షపాచ్చవి।
తాటకా చలకపాలకుండలా కాలికేన నిబిడాబలాకినీ"
(వారి, జ్యానివాదం గ్రహించి, బహుశవక్షపు రాత్రిని బోలి, కసాలాలు కుందలాలుగా వేలాడుతుండగా కొంగలగుంపుతో గూడిన సాంద్రమేఘం వలె అది (తాటక) ప్రాదుర్బవించింది.
"ద్యతైకబ్జయస్దిమాయతీం
శ్రోణిలంబి పురుషాంతమెఖలాం
తాం విలొక్య నవితానధే ఘృణాం
పత్రిణా సహా ముమోహన రాఘవ।"
(ఆయతమైన భుజదండాన్ని యెత్తి పురుషుల పేగులు మొలలో వేలాడుతుండేదాన్ని చూసి బాణంతో గూడా స్త్రీవధలో దయను సయితం విడిచాడు) అని కాళిదాసు రఘువంశంలొ ఘోర కుటిల నిష్ఠుర అని శబ్దవచ్యతపాలుగాకుండా చిత్రించాడు కాని, కొపసందర్భ క్రౌర్య సందర్భం వస్తే ఘోరలు కుటిలాలు క్రూరలు, దురంతలు నిష్ఠురలు ఈ కాలపుకృతి కర్తలనెకులు పులుముతారు.
"కౌర్య కౌటిల్య కలుష పంకంబువలన" (కృష్ణపక్షం)
క్రౌర్య కౌటిల్యకల్పితకఠినదాస్య" (కృష్ణపక్షం)
"ఘోర దు:ఖతమంబున గుందునపుడు" (కృష్ణపక్షం)
"హృదయ దళనదారున మహోగ్రకార్యంబు దలచినావు"
(కృష్ణపక్షం)