పుట:Neti-Kalapu-Kavitvam.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


యిక మానుతున్నాను అసలు గుంపుగణం ప్రకాశగణం, దండగ్గణం మొదలైన వన్నీ వికృతం చేస్తుండగా నన్నయతో ఆరంభమైన ఆంధ్ర పద్యాలే ఆదినుండి పులుముడు దశతో అధమంగా వస్తున్నవి. అయితే ఆగణాలు మాత్రం శ్రీనాథకృతుల్లోవలె కృష్ణకర్ణామృతాదుల్లోవలె కొంత తగ్గి నేటికీ ఆ పులుముడుమాత్రం స్థిరంగా వున్నది. గుంపుగణం మొదలైనవాటిని ప్రథమఖండంలో వివరించాను గనుక యిక్కడ తెలపక వదలుతున్నాను. ఉత్తమత్వ మట్లావుంచినా, ఈఅధమమైన వాచ్యత్వదశను దాటి మధ్యదశకువచ్చిన కావ్యాలే తెలుగులో అరుదని నే ననుకొంటున్నాను.

అని శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో పులుముడుఘటనాధి కరణం సమాప్తం