పుట:Neti-Kalapu-Kavitvam.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


వికృతక్రూరక్షుధాక్షుభిత మృత్యుకఠోర
వికటపాండురశుష్కవదనదంష్ట్రాగ్నిలో నవ్వేలా?

అని నిదర్శనపరంపరకు ఉదాహరించిన పఙ్త్కులూ పులుమడే అయివున్నవి. ఇదివరకు చూపిన "ఐక్యమౌదామె" "వియోగరాగం" "కవితాంశ" పులుముడు దోషంతో కూడివున్నవి.

"ప్రాజ్యపీఠపురీమహారాజ్యబాగ్య
 లక్ష్మి కొలువుదీర్చు చిరత్న రత్న ఖచిత
 భాసమానకల్యాణ సింహాసనంబు
 అది వెలమ శౌర్యమూర్తిరణావనీవి
 హారవిక్రమ కేళికానంతరమ్ము
 శాంతినుండు విలాసవిశ్రామవేది
 అది సభాసీనసకలబుధావతంస
 ఘనకవీశానవిజ్ఞానకాంతిమత్ప్ర
 సన్నవీక్షణ స్నాపిత స్వర్ణపీఠి
 అది మహీపతిఆమరాయావనీంద్ర
 కరకమల వీజ్యమాన చామరసమీర
 పులకిత భవన్మృదుభూషితంబు"

అని ప్రాజ్య బాగ్య భాసమాన, కల్యాణ, శాంతినుండు, మహీపతి అని ఇట్లా యెన్నో అనావశ్యకశబ్దాల గుప్పించిన పులుముడు కృష్ఠపక్షంనిండా వున్నది.

"శారదశర్వరీమధురచంద్రికసూర్యసుతాస్రవంతికా
 చారు వినీల వీచిక ప్రశాంతనిశాపవనోర్మి మాలికా
 చారితనీపశాఖికకృశాంగిని గోపిక నేను" (కృష్ణపక్షం)

అని యీమాదిరి వున్నవన్నీ పులుముడే అయివున్నవి. సాధారణంగా ప్రాకృతస్త్రీలూ హీనులు పోట్లాడేటప్పుడేమీతోచక పొతే నోరువిప్పి పుట్టేదాకా అడ్డగోలుగా తిట్టుమీద తిట్టు పదితిట్లు తిట్టి వూరుకుంటారు.