పుట:Neti-Kalapu-Kavitvam.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


వరించావు" అని యీతీరున వాచ్యంజేసి మాటలు కుక్కడం పులమడం. ఇది కావ్యంలో అధమమార్గం.

"లీలాకమలపత్రాణి గణయామాస పార్వతీ" (కుమా)

అని కాళిదాసు తెలిపిన భావాన్ని "మనోహరలజ్జాలావణ్యసూచకంగా మధుర ప్రణయమనోజ్ఞమైన హృదయంతో దివ్యసౌందర్యవిలిసిత పార్వతి మధురహస్తాబ్జాలతో మధురకమలపత్రాలను మధురంగా గణనచేసింది" అని మాటలు పులమడం అధమకవిత్వం. చిత్తం తమోగుణ బహుళమై పరిణతి హీనమైనప్పుడు ఈఅధమకవిత్వం వెడలుతున్నది. మనజాతికి ఇప్పుడీస్థితే బహుళంగా నాకు కనబడుతున్నది.

ఈకాలపు కృతులనేకాలు ఈఅధమకోటిలోనే చేరుచున్నవి

"మధురమోహనమూర్తి మందహాసమున
 నద్భుతంబుగ లీన మైనట్టులుండ
 మధురహాసంబులో మాధురీప్రకృతి
 యానంద ముద్రిత మైనట్టులుండె
 మధురచంద్రికలలో మధురామృతంబు
 మధురామృతంబులో మధురరసంబు
 మధురరసంబులో మధురబావంబు
 మధురబావంబులో మధురరూపంబు
 మధురరూపంబులో మధురతేజంబు
 మధురమోహనకళా మహితమైవుండ
 మధురస్వరంబులో మధురగీతములు
 మధురగానంబులో మదిమేళగించి" (యేకాంతసేవ)

అని యీతీరున అయోమయపు పులుముడు యేకాంతసేవనిండా కనబడుచున్నది. ఈతీరుగా యేకాంతసేవలోనే కాకుండా ఈకృతికర్తల రచనలన్నీ యిట్లాటిపులుముడుతోనే విస్తారంగా నిండివున్నవి. యేకాంత సేవలో మొదటనుండి చివరవరకూ అంతా పులుముడు పేరివున్నది