పుట:Neti-Kalapu-Kavitvam.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పులుముడుఘటనాధికరణం

87


    "వ్యంగ్యస్య అస్ఫుటత్వే అధమం కావ్యం (ప్రతాప)

అని విద్యానాథుడన్నాడు.

"ప్రాథమికానాం అబ్యాసార్ధినాం యది పరం చిత్రేణ వ్యవహారః
 ప్రాప్తాపరిణతీనాం తుధ్వనిరేవ ప్రాధాన్యేన కావ్యమితి స్థితం"

అని ఆనందవర్ధను డంటున్నాడు.

'అధమం యథా" అని

స్వచ్చందోచ్చలదచ్చకచ్చకుహరచ్ఛాతేతరాంబుచ్చటా
మూర్చన్మోహమహర్షిహర్షవిహితస్నానాహ్నికాహ్నాయ నః
భిద్యా దుద్యదుదారదర్దురదరీదీర్ఘా దరిద్రద్రుమ
ద్రోహోద్రేకమహోర్మిమేదురమదా మందాకినీ మందతాం (కావ్య)

(స్వచ్చందంగా పైకిలేస్తూ నిర్మలతీరనిమ్న ప్రదేశాల్లో అచ్చిన్న మైన నీటిసమూహంవల్ల పోతూవున్న మోహంగల మహర్షులచేత సంతొషంతో విహితమైన స్నానాహ్నికాలు గలదీ యెగిరే అద్బుతమైన కప్పలుగల తటాకందరాల్లో విజృంభిస్తున్న గొప్పఅలలచే సాంధ్రమైన మదంగలదీ అయిన మందాకిని మామాంద్యాన్ని పోగొట్టుగాక) దీన్ని యీఅధమకవిత్వానికి ఉదాహరణంగా కావ్యప్రకాశకారుడు మమ్మటుడు కనబరచాడు.

"అపూర్వకర్మచండాలం అయి ముగ్దే విముంచ మాం
 శ్రితాసి చందనభ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం" (ఉత్తర)

అని భవభూతి తెలిపిన భావాన్ని

"ఓ మౌగ్ధ్యగుణవిలసిత అయినా సీతా! నేను చండాలుడు సైతం చేయలేని నిష్ఠురకార్యాలు ధర్మంకొరకు ఆచరిస్తున్నాను. అట్లాటి నన్ను లౌకికసుఖోపలబ్దికొరకు ఆశ్రయించి తప్పక వ్యర్ధమనోరధ వయినావు చీ! నేను మహాఘోరపాపిని. అవ్యాజప్ర్రేమతో దుర్గమకాంతారాల్లో నాపాదాలను ఆరాధించిన సీతను విడుస్తున్నాను అహో! సీతా! ధర్మనిష్ఠురతచేత కిరాతుడనైన నన్ను నీవు భ్రాంతివశాన