పుట:Neti-Kalapu-Kavitvam.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పులుముడుఘటనాధికరణం

85


అని ఆనందవర్ధనుడు గుణీభూతవ్యంగ్యాన్ని గురించి ప్రస్తావించిన సందర్భంలో అన్నాడు. అదిగాక రసాది తాత్పర్యానుసంధానంచేత గుణీభూతవ్యంగ్యంగూడా ధ్వనిరూపం పొందుతున్న దని

"ప్రకారోయంగుణీభూతవ్యంగ్యోపి ధ్వనిరూపతాం,
 ధత్తే రసాదితాత్పర్య పర్యాలోచనయా పునః (ధ్వన్యా)}]

(రసాదితాత్పర్యపర్యాలోచనచేత గుణీతవ్యంగ్యంగూడా ధ్వని రూపాన్ని వహిస్తున్నది.)

అనే పఙ్త్కులవల్ల ధ్వనికారుడు వినిపిస్తున్నాడు.

ఆకాలానికి వికసితమైన విజ్ఞానపరిపాకం బలప్రదమవుతూ, సత్వప్రాధాన్యం కొంత అణగి రజఃప్రాబల్యంతో భావం నడిచేదశలో గుణిభూతవ్యంగ్యరూపమైన ఈమధ్యమకవిత ఉత్పన్నం కాగలదు.

ఈ కాలపుకృతుల్లో ఈ గుణీభూతవ్యంగ్యకోటిలో చేరేవి. కొమాండూరి కృష్ణమాచార్యుల పాదుకాస్తవంవంటివి కొన్ని మాత్రమే కనబడుతున్నవి. వీట్లో సయితం విస్తరం, వికారాలు, అయోమయత్వం, వక్ష్యమాణశబ్దవాచ్యతా, వుంటే దోషసహిత మే అవుతున్న వి. కృష్ణపక్షం, యేకాంతసేవ ఇట్లాటివి గుణీభూతవ్యంగ్యత్వంవద్దగూడా ఆగక ఇంకా దిగిపోయినవి. ఆసంగతి ముందు తెలుపుతాను.

ఈ కాలపు కవిత్వంలో పులుముడుదోషం విస్తరించి వున్నదన్నాను. దాన్ని క విశదీకరిస్తాను.

పులుముడు.

ఇదే నేటికాలపుకృతుల్లో విశేషంగా కనబడుతున్నది. పులమడ మంట యేమో చెప్పుతాను. నిపుణుడైన చిత్రకారుడు సాధ్యమైనంతవరకు రంగులు తక్కువగా ఉపయోగించి అఖండమైన భావాన్ని ప్రకటిస్తాడు. ఆప్రౌఢిమలేని గుజీలిమనిషి పటంనిండా గాఢంగారంగులు వులుముతాడు. గాఢంగా రంగులు పులమడంవల్ల చిత్రసౌందర్యవివేచనం లేనివాండ్లకు