పుట:Neti-Kalapu-Kavitvam.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పులుముడు ఘటనాధికరణం

81


వికల్పాలూ, ఇట్లా ఒక విశిష్టభావప్రపంచం శ్రోతయొక్క మనః పరిణతిననుసరించి సంకోచవికాసాలుపొందుతూ లీలామాత్రంగా గోచరిస్తుండడం సహృదయవేద్యం. ఇదే కావ్యసౌందర్య విభుత్వం. ఒక వస్తువు యొక్క సౌందర్యమహిమ లభ్యాలభ్యమై దృశ్యాదృశ్య దశయందులీలా మాత్రంగా గోచరిస్తున్నప్పుడు పరమోన్నతి పొందు తున్నది. దీన్నే --

"ప్రతీయమానం పునరన్యదేవ
 వస్త్వస్తి వాణీషు మహాకవీనాం". (ధ్వన్యా)

(మహాకవులవాక్కులలో ప్రతీయమానమయ్యేవస్తువు మళ్లీ వేరేవున్నది.)

"సర్వధా నాస్త్యేవ సహృదయహృదయహారిణః కావ్యస్య సప్ర కారో యత్ర నప్రతీయమానార్థసంస్పర్శేన సౌభాగ్యమ్" (ధ్వన్యా).

(ధ్వనించే అర్ధసంస్పర్శచేత సౌందర్యం లేనటువంటి సహృద హృదయహారికావ్యప్రకారమే సర్వధాలేదు.)

అని సాహిత్యవేత్తలు స్తుతిస్తున్నారు.

ఇట్లా అమేయమై, అమితమై శ్రోతయొక్క పరిణతి ననుసరించి సంకోచవికాసాలు పొందుతూ దృశ్యాదృశ్యదశయందు లీలామాత్ర గోచరమై సౌందర్యపిపాసువుల చిత్తవృత్తికి విశాలావకాశాన్ని ప్రసాదించే కావ్యరచనను సాహిత్యవేత్త లారాధిస్తున్నారు. దీన్నే ధ్వని ఆని కావ్య వేత్తలు చెప్పుతున్నారు. దీని ప్రాధాన్య మిట్లాటిది గనుకనే

"ధ్వని సత్కావ్యముత్తమమ్." (సాహిత్య)

అని విశ్వనాథుడు వినిపిస్తున్నాడు.

ఇంత పరిపాకవంతమైనది గనుకనే దీన్ని భారతీయసాహిత్య వేత్తలు ఉత్తమమయినదంటున్నారు.

"ప్రాప్తపరిణతీనాం తు ధ్వనిరేవ ప్రాధాన్యేన కావ్యమితి స్థితం". (ధ్వన్యా)