పుట:Neti-Kalapu-Kavitvam.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీ ర స్తు

వాజ్మయపరిశిష్టభాష్యం.

అయోమయత్వం

     బుద్ది అపరిణతమై ఉచితభావపరంపరలో స్పష్టతలేనప్పుడు వెలువడే మాటలు అయోమయంగా వుండడం సహజం చెప్పదలచుకొన్నది చెప్పడానికి బలంలేని భీరుత్వమూ చెప్పవలసిన దేమీలేనప్పుడు వ్రాయవలననే కోరికా అయోమయపుమాటలనే వెడలిస్తవి.
 
      ఉన్నది మామూలు అభిప్రాయమై ఓసి అంతేనా అంటారని దాన్ని యేమేమో మాటలతోచెప్పి అయోమయంతొ ఆత్మవంచన చేసుకొంటారు కొందరు.
     ఈ అన్నిరకాల అయోమయాలు నేటికాలపుకవిత్వంలో బహుళంగా కనబడుతున్నవి.

"మధురమోహనమూర్తి మందహాసమున
నద్బుతంబుగ లీనమై నట్టులుండ
మధురహాసంబులో మాధుఇరీప్రకృతి
యానంద ముద్రితమై నట్టులుండె
మధురచంద్రికలలొ మధురామృతంబు
మధురామృతంబులో మధురరసంబు
మధురరసంబులొ మధురభావంబు
మధురభావంబులో మధురతేజంబు
మధుర మొహనకళా మహితమై వుండ
మధురస్వరంబులో మధురగీతముల
మధురగానంబులో మదిమేళగించి" (యేకాంతసేవ)