పుట:Neti-Kalapu-Kavitvam.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

________________

66

వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

3. మరణమే ఆత్మకు స్వభావసిద్దమైన అవస్థ బ్రతుకువికృతావస్థ అని పెద్దలంటారు క్షణమాత్రమరణమైనా శ్రేయస్సే గదా.

(క్షణమాత్ర జీవితమైనా అని మల్లినాథుడు).

4. ప్రియవినాశం హృదయ శల్యంగా మూడుడు భావిస్తాడు,స్థిరప్రజుడు తెరచిన కుశలద్వార మనుకుంటాడు.

5. స్వకీయమైన దేహాత్మలకే సంయోగవియోగాలు కలుగుతూవుం టతెలిసినపొడేమని బాహ్యవిషయ వియోగానికితాపపడతాడు.

6. వశులలో ఉత్త ముడమైన అజుడా! సాధారణుల వలె | దుఃఖానికి వశం కావడం నీకు అర్ఘంగాదు..

"చెట్లూ పర్వతం రెండూ వాయుపతికి కదలితే వాటి కేమిభేదం?"

అని ప్రాణుల సంయోగవియోగజన్యమైన సుఖదుఃఖాలను గురించి

చెప్పించిన ఘట్టంలో "బుదైః" అని విబుధులవిజ్ఞానానికినతిని కనబరచాడు.

ఆకాలంనాటి విజ్ఞానసౌధాన్ని ఆరోహించి తత్వ జిజ్ఞాసలకు

వెలుగునిచ్చే నూతనానుభవాలను సయితం అక్కడక్కడ కాళిదాసాదులు

అనుగ్రహిస్తూ వచ్చారు. కనుకనే శాస్త్రవేత్తలుసయితం

"కర్తవ్యం కాళిదాసాదేః కావ్యానాం పరిశీలనం" అని అన్నారు.

"భిన్న రుచి లోకః' | (రఘు)

అభితప్త మయోపిమార్ధవం భజతే కైవకథా శరీరిష" (రఘు)

అని తీరున విదీతంచేసిన సార్వకాలిక సత్యాలకు తోడు తత్వజిజూసకు కొత్త వెలుగుచూపించే అనుభవాలను ప్రసాదించినప్పుడు శాస్త్రవేత్తలు వీటిని తమజిజ్ఞాసలలో స్వీకరిస్తూ వచ్చారు.